Vice President Poll: ఉపరాష్ట్రపతి ఎన్నికకు ముగిసిన పోలింగ్.. రాత్రికే ఫలితాలు..!

Vice President Poll: ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగించారు. సీక్రేట్ బ్యాలెట్ విధానంలో ఓటింగ్ జరిగింది. ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ఓట్లు వేశారు. అలాగే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, సహా ప్రతిపక్ష నేతలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఇవాళ రాత్రికి ఫలితాలు వెలువడనున్నాయి.
ఉపరాష్ట్రపతి పోలింగ్‌కు వీల్ చైర్‌లో వచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఓటు వేశారు. అలాగే ఎన్డీయే, యూపీఏ మిత్రపక్ష పార్టీలు కూడా ఓటింగ్‌లో పాల్గొన్నాయి. దాదాపు 700 మంది ఓటింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం. ఉపరాష్ట్రపతి ఎన్టీయే అభ్యర్థి జగదీప్ ధన్‌కర్ పోటీలో నిలబడగా.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వా బరిలో నిలిచారు. ఈనెల 10వ తేదీతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ముగియనుంది. ఈ ఫలితాల తర్వాత గెలిచిన అభ్యర్థి 11వ తేదీన ప్రమాణం స్వీకారం చేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com