VICE PRESIDENT: ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగోడు

VICE PRESIDENT: ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగోడు
X

ఇండీ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు వ్యక్తి, మాజీ జడ్జీ, జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ఎంపిక చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశామని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం. ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన సుదర్శన్ రెడ్డి.. నాలుగేళ్ల పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఎన్డీఏ కూటమి తమిళనాడు వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెెట్టగా.. ఇండియా కూటమి దక్షిణాదికి చెందిన తెలంగాణ వ్యక్తిని పోటీగా దింపింది. ఇప్పుడు రాధాకృష్ణన్-సుదర్శన్‌రెడ్డి మధ్య పోటీ నెలకొంది. బి.సుదర్శన్‌రెడ్డి.. స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం. వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యను అభ్యసించారు. నాలుగేళ్ల పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. ఇక రిటైర్మెంట్ తర్వాత గోవా లోకాయుక్త ఛైర్మన్‌గా పని చేశారు.

Tags

Next Story