PAK: పాకిస్థాన్‌లో ఘనంగా జగన్నాథ రథయాత్ర

PAK: పాకిస్థాన్‌లో ఘనంగా జగన్నాథ రథయాత్ర
X
కరాచీలో కన్నులపండువగా వేడుక.... సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌...

పాకిస్తాన్‌లో ‘‘జగన్నాథ రథయాత్ర’’ ఘనంగా జరిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేలాది మంది హిందువులు ఈ రథయాత్రలో పాల్గొన్నారు. పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ముస్లిం ఆధిపత్యం ఉన్న దేశంలో, హిందూ సమాజం తన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించింది. సాధారణంగా ఒడిశాలోని పూరిలో జగన్నాథ రథయాత్ర అట్టహాసంగా జరుగుతుంది. అయితే, ఇదే సంప్రదాయాన్ని పాకిస్తాన్‌లో కూడా కొనసాగిస్తున్నారు. ఈ వేడుకల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, ఇప్పుడు ఇది వైరల్‌గా మారింది. మతపరమైన జెండాలతో పాటు పాకిస్తాన్ జెండాలను ప్రదర్శించారు. పాకిస్తాన్‌లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ కరాచీ, లాహోర్ వంటి ప్రధాన నగరాల్లో హిందువుల సంఖ్య పరిమితంగా ఉంది. 2023 పాకిస్తాన్ జనాభా లెక్కల ప్రకారం 2.17 హిందూ జనాభా ఉన్నట్లు తెలిపింది. ఎక్కువగా హిందువులు సింధ్ ప్రావిన్సులో ఉన్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను చూసిన యూజర్లు, పాకిస్తాన్‌లో ఇలాంటి హిందూ వేడుకని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

బంగ్లాలో సోషల్‌ మీడియాపై నిషేధం

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మళ్లీ నిరసనలు ఆరంభం అయ్యాయి.. ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో మరణించిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఈ ప్రదర్శనలు జరుగుతున్నాయి. కోర్టు తీర్పు తర్వాత నిరసనలు తగ్గాయి. అయితే తాజాగా శుక్రవారం నుంచి మళ్లీ నిరసన కారులు రోడ్డెక్కారు. దీంతో దేశవ్యాప్తంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం నిషేధించింది.

గ్లోబల్ ఐస్ నివేదిక ప్రకారం.. శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా సోషల్ మీడియా సైట్‌లపై తాత్కాలిక నిషేధం విధించబడింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం మొబైల్‌లో మెటా ప్లాట్‌ఫారమ్‌ల నెట్‌వర్క్‌ను మధ్యాహ్నం 12 గంటల తర్వాత పరిమితం చేసింది. ఇంటర్నెట్ స్పీడ్ కూడా చాలా మందగించబడింది. తద్వారా వీపీఎస్ ఉపయోగించి కూడా సోషల్ మీడియాను ఉపయోగించలేరు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో జులై 17న తొలిసారిగా ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. దీని తర్వాత 18న బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను కూడా నిలిపివేశారు. 28వ తేదీ వరకు మొబైల్ నెట్‌వర్క్‌లపై నిషేధం ఉంది. రాజధాని ఢాకాలోని వివిధ ప్రాంతాల్లో రెండు వేల మందికి పైగా నిరసనకారులు గుమిగూడడంతో మళ్లీ ఉద్రిక్తతత పరిస్థితులు ఏర్పడ్డాయి.

Tags

Next Story