Vijay Malya : మాల్యాకు సుప్రీం హెచ్చరిక.. 40 మిలియన్ డాలర్లు చెల్లించక పోతే..

Vijay Malya : మాజీ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. కోర్టు ధిక్కారణ కేసులో మాల్యాకు 4 వారాల్లో 40 మిలియన్ డాలర్లను (317 కోట్ల రూ) చెల్లించమని తీర్పు వెలువరించింది. చెల్లించకపోతే మాల్యా ఆస్తులు అటాచ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. విజయ్ మాల్యా 2017లో సుప్రీం కోర్టుకు తెలియకుండా 40 మిలియన్ డాలర్లను తన పిల్లల అకౌంట్లకు బదిలీ చేశారు. దీనిపై ఆగ్రహించిన సూప్రీం కోర్టు.. విచారించి తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
బ్యాంకులకు 9వేల కోట్ల ఎగవేత కేసులో మాల్యా విచారణను ఎదుర్కొంటున్నారు. అక్రమంగా బదిలీ చేసిన 40 మిలియన్ డాలర్లను 8 శాతం వడ్డీతో 4 వారాల్లోగా బదిలీ చేయమని మాల్యాకు ఆదేశించింది సుప్రీం కోర్టు. దీంతో పాటు 4 నెలల జైలు శిక్ష, 2వేల జరిమాణాను కూడా విధించింది. ప్రస్తుత ఆదేశాలను కూడా ధిక్కరిస్తే జైలు శిక్ష మరో 2 నెలలు కూడా పెరుగుతుందని సూప్రీం స్పష్టం చేసింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com