VIJAY: దళపతి పట్టాభిషేకానికి కుదరని లెక్కలు

VIJAY: దళపతి పట్టాభిషేకానికి కుదరని లెక్కలు
X
విజయ్ ను వెంటాడుతున్న సినిమా కష్టాలు.. "విజయ్ అనే నేను" అనడానికి ఇంకా సమయం.. తమిళ రాజకీయాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ ..తేలని పొత్తులు- విజయ్ కు తప్పని తిప్పలు...

తమిళనాడులో రాజకీయ పరిణామాలు క్షణక్షణానికి మారుతున్నాయి. టీవీకే చీఫ్ విజయ్‌ గురువారం మరోసారి లోక్‌భవన్‌కు వెళ్లి, గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌ను కలిశారు. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి, అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ భేటీపై లోక్‌భవన్ తాజాగా ప్రెస్‌నోట్ విడుదల చేసింది. ‘‘ గవర్నర్ ఆర్లేకర్‌తో విజయ్ భేటీ అయ్యారు. మెజార్టీ కనిపించడం లేదని వివరించారు. మెజార్టీతోనే రావాలని గవర్నర్‌ సూచించారు’’ అని లోక్‌భవన్‌ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మరే ఇతర పార్టీని ఆహ్వానించబోమని విజయ్‌కు గవర్నర్‌ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. గవర్నర్ ఆహ్వానం మేరకే విజయ్ ఆయన్ను కలిసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రెండు రోజుల వ్యవధిలో రెండుసార్లు వీరి భేటీ జరిగింది.118 మంది సభ్యులు (మెజార్టీ మార్క్‌) సమకూరిన అనంతరం రావాలని సూచించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

లేఖ విడుదల చేసిన సీపీఐ

తమి­ళ­నా­డు­లో ప్ర­భు­త్వం ఏర్పా­టు చేసే వి­ష­యం­లో రా­ష్ట్ర గవ­ర్న­ర్ రా­జ్యాం­గ­బ­ద్ధం­గా వ్య­వ­హ­రిం­చా­ల­ని భారత కమ్యూ­ని­స్ట్ పా­ర్టీ డి­మాం­డ్ చే­సిం­ది. ఈ మే­ర­కు సీ­పీఐ తమి­ళ­నా­డు రా­ష్ట్ర కా­ర్య­ద­ర్శి ము.వీ­ర­పాం­డి­య­న్ ఓ బహి­రంగ లేఖ వి­డు­దల చే­శా­రు. ఏప్రి­ల్ 23న జరి­గిన అసెం­బ్లీ ఎన్ని­క­ల్లో ఓట­ర్లు ఏ ఒక్క పా­ర్టీ­కి స్ప­ష్ట­మైన మె­జా­రి­టీ ఇవ్వ­న­ప్ప­టి­కీ, 108 స్థా­నా­లు సా­ధిం­చిన తమిళ వె­ట్రి కజగం పా­ర్టీ­ని అతి­పె­ద్ద పా­ర్టీ­గా­ఎ­న్ను­కు­న్నా­ర­ని సీ­పీఐ లే­ఖ­లో పే­ర్కొం­ది. టీ­వీ­కే అధి­నేత వి­జ­య్ గవ­ర్న­ర్‌­ను కలి­సి ప్ర­భు­త్వం ఏర్పా­టు చే­సేం­దు­కు అవ­కా­శం ఇవ్వా­ల­ని కో­ర­గా, బా­ధ్య­త­లు చే­ప­ట్ట­క­ముం­దే మె­జా­రి­టీ ని­రూ­పిం­చు­కో­వా­ల­ని గవ­ర్న­ర్ ని­బం­ధన వి­ధిం­చ­డం సరి­కా­ద­ని సీ­పీఐ అభి­ప్రా­య­ప­డిం­ది.

అభిమానుల భావోద్వేగం

తమిళనాట టీవీకే అధినేత విజయ్‌ ప్రమాణస్వీకారం వాయిదా పడటంతో ఆయన అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ రాలేదు. ఈ కారణంతో విజయ్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్‌ సమ్మతించలేదు. ఈ క్రమంలో గురువారం జరగాల్సిన విజయ్‌ ప్రమాణస్వీకారం వాయిదా పడింది. ఈ విషయం తెలియక చెన్నై చేరుకున్న ఆయన అభిమానులు నిరాశతో వెనుదిరిగారు. దళపతి ఇంటి ముందు ఓ అభిమాని వెక్కి వెక్కి ఏడ్చాడు. విజయ్‌ సీఎం కావాలంటూ ప్రార్థన చేశాడు.

నేడు కీలక నిర్ణయం

టీ­వీ­కే పా­ర్టీ­కి ప్ర­భు­త్వ ఏర్పా­టు­కు సరి­ప­డా మె­జా­రి­టీ స్థా­నా­లు రా­క­పో­వ­డం­తో వి­జ­య్ వా­మ­ప­క్షా­లు, వీ­సీ­కే మద్ద­తు కో­రా­రు. అయి­తే.. ఈ వి­ష­యం­లో వీ­సీ­కే, సీ­పీఐ, సీ­పీ­ఎం నే­త­‌­లు స్టా­లి­న్­తో సమా­వే­శ­మై సు­దీ­ర్ఘం­గా చర్చిం­చా­రు. శు­క్ర­వా­రం ఉద­‌­యం ఈ మూడు పా­ర్టీల నే­త­లు మరో­మా­రు సమా­వే­శ­మై తుది ని­ర్ణ­యా­న్ని ప్ర­క­టిం­చ­ను­న్న­ట్లు సమా­చా­రం. టీ­వీ­కే­కు ఇప్ప­టి­కే కాం­గ్రె­స్ మద్ద­తు ప్ర­క­టిం­చిన సం­గ­తి తె­లి­సిం­దే. గవ­ర్న­ర్ ఉద్దే­శ­పూ­ర్వ­కం­గా­నే టీ­వీ­కే ప్ర­భు­త్వ ఏర్పా­టు­కు సహ­క­రిం­చ­డం లే­ద­ని ఇప్ప­టి­కే వి­జ­య్ అభి­మా­ను­లు, పా­ర్టీ కా­ర్య­క­ర్త­లు.. వి­శా­ల్, ప్ర­కా­ష్ రాజ్ వంటి సినీ నటు­లు బా­హా­టం­గా­నే ఆరో­ప­ణ­లు చే­స్తు­న్న పరి­స్థి­తి. ఈ క్ర­మం­లో.. టీ­వీ­కే ప్ర­భు­త్వ ఏర్పా­టు, తమి­ళ­నా­డు కొ­త్త సీ­ఎం­గా వి­జ­య్ ప్ర­మాణ స్వీ­కా­రం ఎప్పు­డ­నే ఉత్కంఠ ఇంకా కొ­న­సా­గు­తుం­డ­టం గమ­నా­ర్హం. నేటితో తమిళనాడు ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది.

Tags

Next Story