ఇంగ్లీష్ ప్రొఫెసర్.. మోమోస్ అమ్ముతూ..

వినూత్నంగా ఏది చేసినా ప్రస్తుత రోజుల్లో అది వైరల్ అవుతుంది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి మోమోస్ విక్రయిస్తున్నాడు. అదేమంత పెద్ద విషయం అని అనుకోకండి. ఆయన ఇంగ్లీషులో మాట్లాడుతూ కస్టమర్ లను ఆకర్షిస్తున్నాడు. ఇంతకీ ఏంటి ఆయన బ్యాంక్ గ్రౌండ్ అని తెలుసుకుంటే ఆయనో పెద్ద ఇంగ్లీష్ ఫ్రొఫెసర్ అని తెలిసింది. ఉద్యోగం బోరు కొట్టిందేమో బండి మీద మోమోస్ పెట్టుకుని అమ్ముతున్నారు.
"ఇంట్లో తయారు చేసిన మోమోలను ప్రయత్నించండి. మీకు తప్పకుండా రుచి నచ్చుతుంది" అని చెబుతూనే మోమోలను జాగ్రత్తగా అమర్చాడు. చాలా పరిశుభ్రంగా తయారు చేయబడింది, ఒకసారి ప్రయత్నించండి. మరియు మీరు తినే క్షణంలో, మీరు పదార్థాల రుచితో పాటు లోపల ఉన్న స్టఫింగ్ గురించి కూడా తెలుసుకుంటారు. అతని మాటలు ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, భాషలో అతనికి మంచి పట్టు ఉంది. నెటిజన్స్ ను కూడా ఆకట్టుకుంది.
"ఇంగ్లీష్ ప్రొఫెసర్ బాదం కి చట్నీ మరియు షెజ్వాన్ సాస్‌తో ఇంట్లో తయారు చేసిన మోమోలను విక్రయిస్తున్నాడు". ఈ వీడియో ప్లాట్‌ఫారమ్‌లో 11.5 మిలియన్ల వీక్షణలను సేకరించింది. కామెంట్ సెక్షన్‌లో చాలా ఫన్నీ కామెంట్స్ వచ్చాయి. పంజాబ్‌లో IELTS కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించడం మంచిది అని ఒకరు రాయగా, బాగా ఇంగ్లీష్ టీచర్ కూడా ఇంత బాగా మాట్లాడదు అని మరొకరు రాసుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com