Aanjjan Srivastav : అప్పట్లో అమితాబ్ ఎంత కష్టపడ్డాడంటే..

Aanjjan Srivastav : అప్పట్లో అమితాబ్ ఎంత కష్టపడ్డాడంటే..
X
రాజశ్రీ అన్‌ప్లగ్‌డ్‌తో చాట్‌లో అమితాబ్ తో తన స్నేహాన్ని గుర్తుచేసుకున్న అంజన్ శ్రీవాస్తవ్

అమితాబ్ బచ్చన్ పరిచయం అవసరం లేని పేరు. అయితేనేం అతను ఒక పడి లేచిన కడలి తరంగమే. అంతటి వ్యక్తి కూడా తన జీవితంలో ఒక దశలో సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అయితే అప్పట్లో, అమితాబ్ కు సపోర్ట్ అందించడంలో ప్రముఖ పాత్ర పోషించిన ప్రముఖ నటుడు అంజన్ శ్రీవాస్తవ్. వాగ్లే కి దునియాతో అందరికీ గుర్తు ఉండిపోయే పాత్రతో తెరపై ఒక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అంజన్ శ్రీవాస్తవ్. రాజశ్రీ అన్‌ప్లగ్డ్‌కి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, అంజన్ 1980లలో అమితాబ్ తన కెరీర్ పథంపై తీవ్ర ప్రభావాన్ని చూపిన కుంభకోణంలో చిక్కుకున్న సమయాన్ని గుర్తు చేసుకున్నారు.

ఫిలిమిస్తాన్ స్టూడియోలో తూఫాన్ సినిమా సెట్‌లో తనకు అమితాబ్‌తో జరిగిన సంభాషణ గురించి అంజన్ ఆ షోలో మాట్లాడారు. ఒకానొక సమయంలో అమితాబ్ బచ్చన్ కంపెనీ ABCL లిమిటెడ్ దాదాపు రూ. 90 కోట్ల నష్టాలను చవిచూసింది. అతని వద్ద సినిమాలు లేదా డబ్బు లేవు, చట్టపరమైన కేసులు చుట్టూముట్టాయి, అమితాబ్ ఇంటిపై రికవరీ నోటీసు వంటి ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు తను అతనికి ఇచ్చిన మానసిక స్థైర్యాన్ని గుర్తు చేసుకున్నారు. అంతే కాదు అమితాబ్ బచ్చన్‌పై కెనరా బ్యాంక్ దావా వేయడానికి దారితీసిన పరిస్థితి, దానికి తను అటు అమితాబ్ కి, ఇటు బ్యాంకు కు ఎటువంటి సలహా ఇచ్చాను అనే విషయాన్ని కూడా ఆ షో లో బయటిపెట్టారు.


అమితాబ్ బచ్చన్ దివాళా తీసిన కొంత కాలం తరువాత కౌన్ బనేగా కరోడ్‌పతితో తిరిగి ఎలా పుంజుకున్నాడో గుర్తు చేశారు. అయితే కష్టకాలంలో అమితాబ్ కు అన్ని రకాలుగా సహాయం చేసిన సరే అమితాబ్ తనను ఎందుకు దూరం చేసుకున్నారో ఇప్పటికీ అర్థం కాలేదు అన్నారు. ఇదే విషయమై ఆయన మాట్లాడుతూ "కెబిసి తర్వాత అమిత్ జీతో నా అనుబంధం దెబ్బతింది, అంతకుముందు జయ జీ నాకు ఫోన్ చేసి హోళీ వేడుకలకు రమ్మని ఆహ్వానించేవారు, కానీ నెమ్మదిగా ఆహ్వానాలు, స్నేహాలు మాయమైపోయాయి. ఇదంతా జీవితాన్ని, కెరీర్ని ప్రభావితం చేయకపోవచ్చు కానీ మానసికంగా కాస్త ఇబ్బందులు పెట్టిందన్నారు. ఎక్కడో ఎవరో చేసిన తప్పు తనను, అమితాబ్ ని దూరం చేసిందంటూ వాపోయారు.

Tags

Next Story