Flight Ticket Price Hike: యుద్ధ ప్రభావంతో విమాన టికెట్ ధరలకు రెక్కలు..

Flight Ticket Price Hike:  యుద్ధ ప్రభావంతో విమాన టికెట్ ధరలకు రెక్కలు..
X
లక్షన్నర దాటిన అమెరికా ఫ్లైట్ టికెట్ రేట్..

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం విమాన ప్రయాణాల పై ఎఫెక్ట్ పడింది. అమెరికా.. యూరప్ దేశాలకు వెళ్లాలంటే మిడిల్ ఈస్ట్ దేశాల ఎయిర్ స్పేస్ మీదుగానే రూట్ అవుతాయి. ఇక ప్రస్తుతం యుద్ధ వాతావరణ పరిస్థితుల కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల ఎయిర్ స్పేస్ తాత్కాలికంగా మూసివేయడంతో అనేక విమానయాన సంస్థలు తమ సర్వీసులను నిలిపివేశాయి. యుధ్ధం కారణంగా విమాన ప్రయాణాలు ఆగిపోవడంతో ఎమర్జెన్సీ ప్రయాణాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాగా.. కొన్ని సంస్థలు విమానాలను లిమిటెడ్ గా నడపడంతో టికెట్ ధరలు భారీగా పెరిగాయి. సాధారణ రోజులతో పోల్చితే మూడు రెట్ల అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నాయి.

ఇండియా నుంచి అమెరికా.. యూరప్ దేశాలకు కొన్ని విమానాలు మాత్రమే నడుస్తున్నాయి. అవి కూడా ఎయిర్ ఇండియావే. ఎమర్జెన్సీ టైంలో ప్రభుత్వ అనుమతి వుంటేనే నడుపుతున్నాయి. ఇండియా నుంచి అమెరికా.. యూరప్ వెళ్ళాలంటే టికెట్ ధర వన్ వే కే.. టూ వే టికెట్ ధరలు వసూలు చేస్తున్నాయి సంస్థలు. ఎయిర్ ఇండియా.. ఎతిహాద్.. ఎమిరేట్స్ విమానాల రేట్లకు రెక్కలొచ్చాయి. అమెరికా వెళ్ళాలంటే తొంభై వేల ధర ఉంటే ప్రస్తుతం లక్షన్నర ఉంది. టికెట్ ధరలు ఫ్లైట్ బుకింగ్ టైం లో ఒకలా.. పేమెంట్ టైం లో ఒకలా చూపిస్తున్నాయి. అంటే నిమిషం నిమిషానికి చార్జ్ మారుతోంది. గల్ఫ్ దేశాలకు కొన్ని విమానాలు నడుస్తున్నా అవి టేకాఫ్‌ అవుతాయా లేదా అన్నది మరో డైలమా. ఇంకొన్ని విమానాలు గమ్యస్థానాలకు వెళ్ళే దారి నుంచి వెనక్కి వచ్చేస్తున్నాయి.

హైదరాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు అధికంగా ప్రయాణికులు ఉంటారు. ఒకవేళ విమానాలు షెడ్యూల్ చేసినా ఎప్పుడు క్యాన్సిల్ అవుతాయో అర్థంకాక ప్యాసింజర్లు ఇబ్బంది పడుతున్నారు. మొత్తంగా..యుద్ధం విమానయాన రంగాన్ని ప్రభావితం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కొన్ని సంస్థలు రిస్క్ ఎందుకులే అని తమ సర్వీసులను ఆపేయగా.. కొన్ని సంస్థలు భారీగా టికెట్ రేట్లు పెంచేసి సొమ్ము చేసుకుంటున్నాయి. మొత్తంగా యుద్ధ ప్రభావంతో విమాన ప్రయాణాలు భారంగా మారాయి. టికెట్ దొరకడం ఒకెత్తయితే.. రేట్లు మరో ఎత్తు. టికెట్ దొరికినా అది డెస్టినేషన్‌కు పోతుందో….యుద్ధం భయంతో మధ్యలోనే రిటర్న్ అవుతుందో తెలీక ప్రయాణికులకు డైలమా తప్పడం లేదు.

ఇరాన్ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తతలు భారత విమానయాన రంగాన్ని ప్రభావితం చేయడం ప్రారంభించాయి. ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో, Air India తన టిక్కెట్లపై ఇంధన సర్‌ఛార్జ్‌ను పెంచింది. ఈ పెంపు దేశీయ మరియు అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు ₹400 నుండి ₹3,000 వరకు అదనపు ఖర్చును కలిగిస్తుంది.

Tags

Next Story