Delhi Police: వరల్డ్ కప్ కోసం 16 ఏళ్లు వేచి ఉన్నాం..సిగ్నల్ పడితే కాసేపు ఆగలేమా?

టీ20 వరల్డ్ కప్ లో భారత్ విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. 7 పరుగుల తేడాతో భారత్ విశ్వవిజేతగా మారింది. ఎట్టకేలకు భారత క్రికెట్ అభిమానుల కల నెరవేరింది. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి విజయతీరాలకు చేర్చారు. 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌లో భారత్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఆసక్తి కర ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఎక్స్ లో ఇది వైరల్ గా మారింది.
17 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విజయం సాధించిన ఇండియా జట్టు టీ20 వరల్డ్‌కప్‌ను రెండు సార్లు సొంతం చేసుకున్న జట్ల జాబితాలో టీమ్‌ఇండియా నిలిచింది. భారత్‌కంటే ముందు ఇంగ్లండ్ (2010, 2022), వెస్టిండీస్ (2012, 2016) జట్లు ఉన్నాయి. ‘మనమంతా భారత జట్టు మరో టీ20 వరల్డ్ కప్ గెలుపు కోసం 16 ఏండ్ల 9 నెలల 5 రోజులు (52 కోట్ల 70 లక్షల 40 వేల సెకన్లు) వేచిచూశాం. అదేవిధంగా ట్రాఫిక్ సిగల్స్ వద్ద కూడా ఓపికతో ఉందాం. మంచి క్షణాలు వేచి ఉండాల్సినవి. మరి మీరేమంటారు? టీమ్‌ఇండియాకు హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com