5 వాగ్దానాలు చేశాం.. 2 గంటల్లో అమలు చేస్తాం: రాహుల్ గాంధీ

5 వాగ్దానాలు చేశాం.. 2 గంటల్లో అమలు చేస్తాం: రాహుల్ గాంధీ
మే 13న 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో 135 స్థానాలను గెలుచుకోవడం ద్వారా కాంగ్రెస్ భారీ విజయాన్ని సాధించింది.

మే 13న 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో 135 స్థానాలను గెలుచుకోవడం ద్వారా కాంగ్రెస్ భారీ విజయాన్ని సాధించింది. కాంగ్రెస్ హైకమాండ్ అనేక చర్చలు జరిపి సీఎం బరిలో ఉన్న డికేను ఉపముఖ్యమంత్రిగా, సిద్ధరామయ్యను సీఎంగా ప్రకటించి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయించింది. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు.

కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రెండోసారి ప్రమాణ స్వీకారం చేయగా, ఏకైక డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరిని కాంగ్రెస్‌ ముఖ్యనేతలు అభినందించిగా, గవర్నర్‌ మెమెంటోలు అందజేశారు. ప్రమాణస్వీకారం చేసిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ కుమారుడు ప్రియాంక్ ఖర్గే కూడా ఉన్నారు. ప్రియాంక గాంధీ వాద్రా సహా పార్టీ ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్, సుఖ్విందర్ సింగ్ సుఖుతో సహా ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు.

అవినీతి రహితంగా తమ నాయకులు పనిచేస్తారని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. మొదటి కర్ణాటక క్యాబినెట్ సమావేశంలో ఐదు ఎన్నికల వాగ్దానాలకు సంబంధించి చట్టాలను ఆమోదించనున్నట్లు కూడా చెప్పారు. "మేము మీకు 5 వాగ్దానాలు చేసాము. స్వలాభం కోసం తప్పుడు వాగ్దానాలు చేయము. ఎన్నికల సమయంలో ప్రజలకు ఏం చెప్పామో అదే చేస్తాము అని అన్నారు.

కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ, " మొత్తం ఐదు హామీలను అమలు చేస్తాము." అని అన్నారు. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడాన్ని రాహుల్ గాంధీ ''ద్వేషంపై ప్రేమ గెలిచింది" అని అన్నారు. "పేదలు, దళితులు, ఆదివాసీలు వెనుకబడిన వారికి" అండగా నిలవడం వల్లనే ఇటీవలి ఎన్నికలలో తమ పార్టీ ఘన విజయం సాధించిందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అన్నారు.

Tags

Next Story