West Bengal: పాపులారిటీ కోసం కన్నబిడ్డను అమ్మేశారు

West Bengal: పాపులారిటీ కోసం కన్నబిడ్డను అమ్మేశారు
ఐఫోన్ కొని రీల్స్ చెయ్యటం కోసం..

సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం ఒక జంట దుర్మార్గపు పని చేశారు. ఏకంగా కన్న బిడ్డను అమ్ముకున్నారు. ఆ వచ్చిన డబ్బుతో ఐ ఫోన్ కొనుక్కొని దానితో రీల్స్ చేయడం కోసం సెకండ్ హనీమూన్ కి వెళ్లారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.

ఉత్తర 24 పరగణాల జిల్లా పానిహతిలోని గాంధీనగర్ కు చెందిన జయదేవ్, సాథి దంపతులకు ఏడేళ్ల కుమార్తె, 8 నెలల కుమారుడు ఉన్నారు. వీరు సామాజిక మాధ్యమాల్లో పాపులారిటీ సంపాదించుకోవాలని అనుకున్నారు. అందరిలాగే రీల్స్ చేయాలని కలలు కన్నారు. అయితే వారి వద్ద స్మార్ట్ ఫోన్ లేదు. దాన్ని కొనేందుకు డబ్బు కోసం కన్న కొడుకుని అమ్మకానికి పెట్టారు. ఎనిమిది నెలల కుమారుడిని రూ.2 లక్షలకు విక్రయించారు. ఆ వచ్చిన డబ్బుతో ఓ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా, సముద్ర తీరాలు సహా అనేక ప్రాంతాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో రీల్స్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసేవారు.


అయితే, కొన్ని రోజులుగా వారి కుమారుడు కనిపించకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో చిన్నారి ఎక్కడ అని ప్రశ్నించగా వాడిని అమ్మి, ఫోన్ కొని, హనీమున్ కి వెళ్ళి రీల్స్ చేసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసినట్టు జయదేవ్, సాథి దంపతులు గొప్పగా చెప్పుకొచ్చారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దంపతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story