Narendra Modi: మోదీ మళ్లీ ప్రధాని కావాలంటూ రక్తార్పణ.. కానీ

Narendra Modi:  మోదీ మళ్లీ ప్రధాని కావాలంటూ రక్తార్పణ.. కానీ
పొరపాటున వేలు నరుక్కున్న వ్యక్తి

మోదీ వీరాభిమాని అయిన వ్యక్తి మూడోసారి ప్రధాని కావాలని ఆకాక్షించాడు. దీని కోసం కాళీ మాతకు రక్తాన్ని అర్పించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పొరపాటున వేలు నరుక్కున్నాడు. సగానికిపైగా తెగిన వేలిని పరిశీలించిన డాక్టర్లు సర్జరీ ద్వారా అతికించడం కష్టమని తేల్చారు. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కార్వార్‌లోని సోనార్వాడలో నివసిస్తున్న అరుణ్ వెర్నేకర్, ప్రధాని మోదీ వీరాభిమాని. ఆభరణాల వ్యాపారి అయిన అతడు బీజేపీ మద్దతుదారుడు. తన ఇంట్లో మోదీ కోసం చిన్న గుడి కూడా కట్టాడు. మోదీ విగ్రహానికి నిత్యం పూజలు చేస్తున్నాడు.

దేశంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇక బీజేపీ కార్యకర్తలు, అభిమానుల్లో ఎక్కువ మంది కూడా నరేంద్ర మోదీ అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. అలాంటి ఫ్యాన్స్ కొందరు చేసే పనులతో అది అభిమానం కాదు పిచ్చి అని తెలిసిపోతుంది. ప్రధాని మోదీ అంటే ఎంతో ఇష్టం ఉన్న ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు అతడిని వికలాంగుడిని చేసింది. ఎందుకంటే కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ గెలిచి ప్రధాని కావాలని ఆ వ్యక్తి.. కాళీ దేవికి రక్త తర్పణం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే అతని వేలు తెగిపోవడం సంచలనంగా మారింది. అయితే తాము కూడా ఏం చేయాలేమని డాక్టర్లు కూడా చేతులెత్తేయడంతో అతడికి వేలు లేకుండా పోయింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో ప్రధాని మోదీ మళ్లీ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఆ బీజేపీ మద్దతుదారుడు ఆకాంక్షించాడు. ఇందుకోసం తన ఇంట్లో నరేంద్ర మోదీ గుడి పక్కనే ఉన్న కాళీ మాత ఫోటో వద్ద రక్త తర్పణం చేయడానికి సిద్ధం అయ్యాడు. ఈ క్రమంలోనే కత్తిని తీసుకువచ్చి తన చేయిని కట్ చేసుకున్న అరుణ్ వెర్నేకర్.. పొరపాటున వేలు నరుక్కున్నాడు. ఈ సంఘటనతో అరుణ్ వెర్నేకర్‌తోపాటు అక్కడ ఉన్నవారంతా షాక్ ఇయ్యారు. వేలు నరుక్కోవడంతో ఆ వ్యక్తిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అనంతరం అరుణ్ వెర్నేకర్‌ను పరిశీలించిన డాక్టర్లు.. అతని వేలు సగానికిపైగా తెగిందని గుర్తించారు. అయితే ఆ వేలిని సర్జరీ ద్వారా అతికించడం కష్టమని డాక్టర్లు తేల్చారు. కాగా, వేలు తెగిన సంఘటనను అరుణ్‌ రికార్డ్‌ చేసిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Tags

Read MoreRead Less
Next Story