ఎవరీ లింగాయత్‌లు.. కర్ణాటకలో వాళ్లెందుకు కింగ్‌మేకర్‌లు

ఎవరీ లింగాయత్‌లు.. కర్ణాటకలో వాళ్లెందుకు కింగ్‌మేకర్‌లు
ఎన్నికలకు నెల రోజుల సమయం ఉండగా లింగాయత్‌లపై బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.

మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాది.. ఇద్దరు లింగాయత్ సంఘం నాయకులు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే వారికి బీజేపీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో కాంగ్రెస్‌లో చేరారు. ఎన్నికల ఫలితాలను నిర్ణయించడంలో కులమే కీలక అంశంగా ఉన్న కర్ణాటకలో, ఓటు బ్యాంకులను ప్రభావితం చేయగల లింగాయత్ లేదా వీరశైవ-లింగాయత్ కమ్యూనిటీ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఎన్నికలకు నెల రోజుల సమయం ఉండగా లింగాయత్‌లపై బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.

అసలీ ఎవరీ లింగాయత్‌లు.. ఏంటి వారి కథ

- లింగాయత్ అనేది 12వ శతాబ్దపు సంఘ సంస్కర్త కన్నడ కవి బసవన్న సూత్రాల నుండి ఉద్భవించిందని నమ్ముతారు. లింగాయత్‌లకు ఒక గుర్తింపును తీసుకువచ్చింది బసవ అని పండితులు విశ్వసిస్తారు.

- కుల రహిత సమాజం కోసం స్త్రీ, పురుషులకు సమాన అవకాశాల కోసం ఆలయ పూజలను, బ్రాహ్మణ సంప్రదాయాలను బసవ తిరస్కరించాడు.

- సంవత్సరాలుగా, కఠినమైన హిందూ కుల వ్యవస్థ నుండి తప్పించుకోవడానికి చాలా మంది అట్టడుగు కులాల ప్రజలు లింగాయత్‌లుగా మారారు.

కర్ణాటకలో లింగాయత్‌లు ఎందుకు అంత పాపులర్..

- కర్నాటకలో లింగాయత్‌లు అతిపెద్ద సమూహంగా పరిగణించబడతారు. రాష్ట్రం మొత్తం జనాభాలో 17 శాతం లింగాయత్‌లు ఉన్నారు. అందుకే రాజకీయ నాయకుల దృష్టి వారి మీద ఎక్కువగా ఉంటుంది.

- మొత్తం 224 నియోజకవర్గాల్లో 100 స్థానాల్లో ఈ సంఘం ఆధిపత్యం కలిగి ఉంది, వీటిలో ఎక్కువ స్థానాలు ఉత్తర కర్ణాటక ప్రాంతంలో ఉన్నాయి.

- లింగాయత్ బీజేపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఏర్పడింది. దక్షిణాది రాష్ట్రానికి ఇప్పటివరకు ఉన్న 23 మంది ముఖ్యమంత్రులలో 10 మంది ఈ వర్గానికి చెందినవారే. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లింగాయత్‌లు పెద్ద సంఖ్యలో ఉన్నందున ఎన్నికలను ప్రభావితం చేయగల సామర్థ్యం వారికి ఉంది.

- లింగాయత్‌ల విషయంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ పోరు ముదురుతోంది. లింగాయత్ సామాజికవర్గాన్ని ఆ పార్టీ అసభ్యంగా చిత్రీకరించిందని ప్రచారం చేయడం ద్వారా లింగాయత్ ఓటు బ్యాంకును చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది.

- ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి లింగాయత్‌ సామాజికవర్గంపై ప్రత్యేక అభిమానం చూపుతూ, విభజించు పాలించు విధానాన్ని అనుసరిస్తున్నదని కాంగ్రెస్‌‌పై ఎదురుదాడికి దిగింది బీజేపీ.

- ఈ సంవత్సరం, ముగ్గురు లింగాయత్ కమ్యూనిటీ నాయకులు బిజెపి తరపున పోటీ చేయడం లేదు. మాజీ సీఎం జగదీష్ షెట్టర్, కర్ణాటక మాజీ డిప్యూటీ సిఎం లక్ష్మణ్ సవాదిలకు టిక్కెట్ ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించడంతో కాంగ్రెస్‌లో చేరారు. ఇక మాజీ సీఎం యడియూరప్ప ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పుకున్నారు.

Tags

Next Story