Congress : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షపదవి ఎన్నికల్లో గెలుపెవరిది..?

Congress : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షపదవి ఎన్నికల్లో గెలుపెవరిది..?
Congress : సుదీర్ఘకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగబోతోంది

Congress President Elections : సుదీర్ఘకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగబోతోంది. 2019 పరాజయం అనంతరం పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌గాంధీ రాజీనామా చేశాక... సోనియా కేవలం తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. గాంధీ కుటుంబం నుంచే పార్టీకి నాయకత్వం వహించాలని పార్టీలో డిమాండు వినిపిస్తున్నా రాహుల్ కానీ గాంధీ కుటుంబ సభ్యులు గానీ అధ్యక్షపదవి స్వీకరించేందుకు సిద్ధంగా లేకపోవడంతో ఎన్నిక అనివార్యమయ్యింది.

ఇప్పటికే పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశమై ఈనెలాఖరులోపు ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించిన నేపథ్యంలో ఎవరు పోటీ చేస్తారు అన్న అంశం సర్వత్రా ఆసక్తి నెలకొల్పుతోంది. పార్టీలోని సీనియర్లెవరూ పోటీకి సిద్ధంగా లేకపోవడం, జూనియర్లలో చాలామంది రాహుల్ మాత్రమే పార్టీని నడిపించాలని పట్టుపడుతున్న తరుణంలో కౌన్‌ బనేగా కాంగ్రెస్‌ కింగ్‌ అనే చర్చ మరింత జోరందుకుంది.

తాజాగా తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ పోటీకి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. మంగళవారం సోనియా గాంధీని కలిసి తన అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఆమె థరూర్ నిర్ణయానికి ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది.

సోనియా కూడా పార్టీలో ఎన్నిక ద్వారానే అధ్యక్షపదవి అభ్యర్థిని నిర్ణయించేందుకు సుముఖంగా ఉన్నారు. మరోవైపు పార్టీ సీనియర్ నాయకుడు, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అధ్యక్ష పదవి చేపట్టాల్సిందిగా పలువురు సూచిస్తున్నారు. తాను వ్యక్తిగతంగా గాంధీ కుటుంబ సభ్యులనే అధ్యక్ష పదవికి సమర్ధిస్తానని.. పోటీ తప్పని పక్షంలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని గెహ్లాట్ చెప్పారు.

థరూర్ మాత్రం పార్టీలో అంతర్గత ఎన్నిక విధానం ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ పునర్వైభవాన్ని తీసుకొస్తుందని నమ్ముతున్నారు. బ్రిటన్ లోని కన్సర్వేటివ్ పార్టీకూడా వరుసగా రెండు పరాజయాల అనంతరం అంతర్గత ఎన్నిక ద్వారా జరిగిన డిబెట్స్ తదితర కార్యక్రమాల ద్వారా దేశ వ్యాప్తంగా తన బలాన్నీ , మద్దతునూ పెంచుకుందన్న ఉదాహరణ చూపుతున్నారు.

కాంగ్రెస్ పార్టీలో తనకు యువత సమర్ధన ఉండటం ఓ సానుకూల అంశమేనని థరూర్ భావిస్తున్నారు. వారికి అత్యంత కీలకమైన ఉద్యోగ, ఉపాధి, ఆర్ధిక అంశాలపై చర్చలు లేవనెత్తడం, అంతర్జాతీయ అంశాలపైకూడా అవగాహణ కలిగుండటం కలిసొస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా కాంగ్రెసేతర పార్టీల నాయకులకు కూడా థరూర్ సానుకూలమైన వ్యక్తి కావడం భవిష్యత్‌లో కూటముల ఏర్పాటుకు కలిసివచ్చే అంశమేనని కొందరు భావిస్తున్నారు.

ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఇంకా వాయిదా వేయలేని పరిస్థితుల్లో ప్రారంభమైన ఈప్రక్రియ ద్వారా... పార్టీ సిద్ధాంతాలనూ, లౌకిక విదానాన్నీ, దక్షిణాది రాష్ట్రాల పార్టీల మద్దతునూ కూడగట్టడం కలిసొస్తుందనే విశ్లేషనలు వెలువడుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story