Medras high court: భర్త ఆస్తిలో భార్యకు సమాన వాటా

Medras high court: భర్త ఆస్తిలో భార్యకు సమాన వాటా
ఆస్తి ఎవరి పేరున ఉన్నా ఇద్దరి హక్కు సమానమన్న మద్రాస్ హైకోర్టు

భర్త సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తిలో భార్యకు కూడా సమాన వాట ఉంటుందని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఒక గృహిణిగా ఆమె కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వహించడం వలన మాత్రమే భర్త స్వేచ్ఛగా ఒత్తిడి లేకుండా సంపాదన పై దృష్టి పెట్టగలడని కోర్టు వ్యాఖ్యానించింది.

భార్యాభర్తల ఇద్దరి సమన్వయం లేకుండా ఒక కుటుంబం నిలబడదు అనేది సత్యం. భర్త ఇతర ఆలోచన లేకుండా డబ్బు సంపాదనపై దృష్టి పెట్టాడు అంటే అందుకు భార్య కుటుంబాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించడమే కారణం. అందువల్లే అతను ఆస్తులు సంపాదించగలుగుతాడు. కాబట్టి భర్త తన పేరున సంపాదించిన ఆస్తిలన్నింటిలోనూ భార్య సమాన హక్కుదారని మద్రాస్ హైకోర్టు జస్టిస్ కృష్ణ రామస్వామి తీర్పునిచ్చారు. సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలో ఇప్పటివరకు భార్య భాగస్వామ్యాన్ని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని గుర్తించే చట్టమే రూపొందించలేదన్నారు. సంపాదనలో భార్యా సమానంగా సహకరిస్తుందని, ఈ వాస్తవాన్ని ఆధారంగా చేసుకుంటే ఏ మహిళను ఇంటి విషయాల్లో ఆమె చేసే సాయం విలువ లేదన్న మాట అనలేము అన్నారు. ఇద్దరి కృషి, పొదుపు లేకుండా ఎలాంటి ఆస్తిని కొనుగోలు చేయడం సాధ్యం కాదని చెప్పారు. దశాబ్దాల పాటు కుటుంబాన్ని పిల్లలను భార్య ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది చివరకు వెనుతిరిగి చూసుకుంటే ఆమెకు తన సొంతమని చెప్పుకోవడానికి ఏమీ మిగలదని, కుటుంబ సంక్షేమం కోసం ఆస్తులు సంపాదనలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భార్యాభర్తల భాగస్వామ్యం ఉంటున్నప్పుడు ఆస్తిలో కూడా ఇద్దరికీ సమాన వాటా ఉంటుంది అని స్పష్టం చేశారు.

భార్యాభర్తల మధ్య నడుస్తున్న ఒక కేసు విషయంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 1965 లో పెళ్లి చేసుకుంది ఒక జంట. అయితే 2002లో భర్త కన్నయ్య నాయుడు భార్య మీద కేసు వేశాడు. తన భార్య తన ఆస్తులను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోందని, తను విదేశాలకు వెళ్లి తిని, తినక డబ్బు సంపాదించి పంపానని ఆ ఆస్తులతో కొన్న ఇంటిని ఇప్పుడు ఆవిడ ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తోంది అని, తను లేనప్పుడు ఆమె వేరే వ్యక్తితో బంధాన్ని కూడా ఏర్పరచుకుందని ఇటువంటి మహిళలకు తన ఆస్తిలో వాటా లేదని కోర్టుకు వెళ్లారు. అయితే భార్య అందుకు ఒప్పుకోలేదు. తన సంపూర్ణ సహకారాలు లేకుండా ముగ్గురు పిల్లల్ని తను చూసుకోకుండా ఉండి ఉంటే అతను ఏ విధంగా డబ్బులు సంపాదించేవారని ఆమె ప్రశ్నించింది. తన పుట్టింటి నుంచి తెచ్చిన డబ్బు తన భర్త విదేశీ యానం గురించి ఖర్చు చేశానని అదంతా వదిలేసి ఇప్పుడు కేసు వేశారంటు ఆవేదన వ్యక్తం చేసింది. అయితే కేసు నడుస్తుండగానే కన్నయ్య నాయుడు మరణించాడు. ఇప్పుడు తాజాగా పిల్లలు తండ్రి చట్టబద్ధమైన వారసులుగా హైకోర్టులో రెండో అప్పీల్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కుటుంబంలోని భార్యాభర్తల సమాన హక్కులపై వ్యాఖ్యలు చేసిన కోర్టు భార్య దాఖలు చేసిన పిటిషన్ను అనుమతించింది.

Tags

Read MoreRead Less
Next Story