Rajasthan: భర్తపై అనుమానంతో ఫాలో అయిన భార్య.. అనుకున్నట్టుగానే అతడు కారులో..

Rajasthan: భార్య ఉండగానే మరో మహిళతో సంబంధం పెట్టుకున్న భర్తల గురించి తరచుగా వార్తల్లో చూస్తుంటాం. అయితే ఇలాంటివి నేరం అని చెప్పాల్సిన పోలీసు వ్యవస్థలో ఉన్న వ్యక్తే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డాడు. రోజూ భార్యతో అబద్ధం చెప్పి ప్రియురాలితో షికారుకు వెళ్లొస్తున్నాడు. దీంతో అనుమానంతో భార్య ఫాలో అవ్వగా తన అనుమానమే నిజమయ్యింది.
రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన సురేంద్ర అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అయితే రోజూ స్నేహితులను కలిసి వస్తానని భార్యకు చెప్పి బయటికి వెళ్తొస్తున్నాడు. ఈ తంతు కొన్నాళ్లుగా సాగుతోంది. దీంతో భార్యకు అనుమానం వచ్చింది. ఒకరోజు అలాగే స్నేహితులను కలిసి వస్తాను అని చెప్పి బయటికి వెళ్లిన భర్తను స్కూటీపై ఫాలో అయ్యింది.
సురేంద్ర భార్య అనుమానమే నిజమయ్యింది. అనుకున్నట్టుగానే అతడు వేరొక అమ్మాయిని కారులో ఎక్కించుకున్నాడు. ఆ కారును ఫాలో అయ్యి భర్తను వేరే అమ్మాయితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది భార్య. అంతే కాకుండా ఆ అమ్మాయిని చెప్పుతో కొట్టింది. భర్తపై కూడా దాడి చేసింది. చుట్టుపక్కన వాళ్లు ఎంత చెప్పినా తను శాంతించలేదు. చివరికి కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి నార్మల్ అయ్యింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com