Divorce: 'టీవీ లేకపోతే భార్య ఉండదు..' విడాకులకు వింత కారణం..

Divorce: టీవీ లేకపోతే భార్య ఉండదు.. విడాకులకు వింత కారణం..
Divorce: వినగానే ఆశ్చర్యంగా అనిపించే విడాకుల ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో చోటుచేసుకుంది.

Divorce: సీరియల్స్ అంటే ఆడవారికి చాలా ఇష్టం అని ఇప్పటికీ చాలామంది ఎగతాలి చేస్తుంటారు. సీరియల్స్ చూసే సమయంలో ఏ అనర్థం జరిగినా కూడా పెళ్లాం.. మొగుడిని పట్టించుకోదు అంటుంటారు. సీరియల్స్ కోసమో కాదో కానీ టీవీకి అడిక్ట్ అయిన ఒక భార్య.. భర్తకు విడాకులు ఇచ్చేవరకు వెళ్లింది. వినగానే ఆశ్చర్యంగా అనిపించే ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో చోటుచేసుకుంది.

భార్య టీవీ చూడడానికి వీలు లేకుండా డీటీహెచ్ రిచార్జ్ అయిపోయింది. అయితే అప్పటికప్పుడు రిచార్జ్ చేయమని భర్తను అడగగా అతడు డబ్బులు లేవన్నాడు. దీంతో టీవీ లేకపోతే భార్య ఉండదు అంటూ ఓ ఎమోషనల్ డైలాగ్ చెప్పి పుట్టింటికి వెళ్లిపోయింది. సాయంత్రం పని నుండి వచ్చిన తర్వాత రిచార్జ్ చేయిస్తానన్నా కూడా తను వినలేదు.

అందుకే ఆ భార్య.. భర్తను విడాకులు కోరగా ఈ విషయం పోలీసులకు వరకు వెళ్లింది. విడాకులకు కారణం తెలుసుకున్న పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు. వారిద్దరికీ కౌన్సిలింగ్ ఇప్పించి మళ్లీ ఒక్కటి చేశారు. కనీసం ఇప్పటినుండైనా భర్త.. గుర్తుపెట్టుకొని రిచార్జ్ చేయిస్తాడో లేదో..

Tags

Read MoreRead Less
Next Story