Mallikarjun Kharge: మధ్యప్రదేశ్ ఎన్నికల్ల తరువాత కులగణన

దాదాపు ఏడు దశాబ్దాలపాటు భారత రాజ్యాంగ విలువలను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడటం వల్లనే నరేంద్రమోదీ ప్రధాని కాగలిగారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. భారతీయ జనతా పార్టీ....ఈడీని బూచీగా చూపి తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తోందని ఆరోపించారు. త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్ లోని-బుందేల్ ఖండ్ లో పర్యటించిన ఖర్గే రాహుల్ గాంధీ విజ్ఞప్తితో మంజూరైన ఆ ప్రాంతప్యాకేజీని భాజపా ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కులగణన చేపడతామని ఖర్గే హామీ ఇచ్చారు. దళితుల ఆరాధ్యుడు సంత్ రవిదాస్ స్మారకాన్ని 100కోట్లతో నిర్మించే పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని.... దిల్లీలో ఆయన మందిరాన్ని కూల్చేశారని పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ కుల గణనను నిర్వహిస్తామనిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. మధ్యప్రదేశ్ లో పర్యటిస్తున్న ఖర్గే.. బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని సాగర్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రసంగించారు. మధ్యప్రదేశ్ లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. మరోవైపు మణిపూర్‌లో హింస, అల్లర్లు చెలరేగిన ప్రధాని నరేంద్ర మోడీ ఏమీ చేయలేదని ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com