Hemant Soren: అజ్ఙాతం వీడిన ముఖ్యమంత్రి.. ఎమ్మెల్యేలతో భేటి

Hemant Soren: అజ్ఙాతం వీడిన ముఖ్యమంత్రి.. ఎమ్మెల్యేలతో భేటి
హేమంత్ సోరెన్ సతీమణికి ఝార్ఖండ్ పగ్గాలు?

ఝార్ఖండ్ లో ఉత్కంఠ వీడింది. అజ్ఞాతంలో ఉన్నట్లు ప్రచారం జరిగిన..ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాంచీలోని తన నివాసానికి చేరుకున్నారు. భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నహేమంత్ ను విచారించేందుకు సోమవారం దిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లింది. గత రాత్రి పొద్దు పోయేవరకూ ఎదురు చూసినా సోరెన్ అక్కడికి రాలేదు. సీఎంకు చెందిన ఓ BMW కారు, 36 లక్షల రూపాయల నగదు, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకుని అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే గత అర్ధరాత్రి హేమంత్ సోరెన్ రాంచీలోని తన నివాసానికి చేరుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే...ఝార్ఖండ్ సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలంతా రాంచీ చేరుకోగాహేమంత్ సోరెన్ వారితో చర్చలు జరుపుతున్నారు. మనీలాండరింగ్ కేసులో బుధవారం విచారణకు హాజరవుతానని EDకి హేమంత్ సోరెన్ సమాచారం ఇచ్చినందున భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నారు.

మరోవైపు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుప్రచారం జరుగుతోంది. జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవిని.. తన సతీమణికి అప్పగించాలని హేమంత్ సోరెన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. భూ కుంభకోణ మనీలాండరింగ్‌ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్‌ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించి విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలోనే.. జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలు రాంచీకి చేరుకోవడంతో ఒక్కసారిగా ఏదో జరగబోతోందనే సంకేతాలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలోనే జార్ఖండ్ సీఎం మార్పు ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈడీ విచారణ నేపథ్యంలో హేమంత్ సోరెన్‌ అరెస్ట్‌ అయితే.. ఆయన సతీమణికి సీఎం పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని జార్ఖండ్‌ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.


మరోవైపు ఈ వ్యవహారంపై రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆసక్తికరంగా స్పందించారు. రాష్ట్రంలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నానని, తన బాధ్యతను నిర్వర్తిస్తున్నానని, సరైన సమయం వచ్చినప్పుడు స్పందిస్తానని ఆయన అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని వ్యాఖ్యానించారు. అయితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించే దిశగా బీజేపీ కుట్రలు చేస్తోందని జేఎంఎం మిత్రపక్షమైన కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఆసక్తికర పరిణామాల మధ్య చివరిసారిగా ఆదివారం రాత్రి ఢిల్లీలో కనిపించిన హేమంత్ సోరెన్ మంగళవారం రాంచీలోని తన నివాసంలో ప్రత్యక్షమయ్యారు. ఎమ్మెల్యేల సమావేశానికి తన ఇంటి నుంచే బయలుదేరి వెళ్లారు. దీంతో జార్ఖండ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

Tags

Read MoreRead Less
Next Story