Parliament Session : డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

Parliament Session : డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
నేడు అఖిలపక్షం భేటీ..

డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు పిలుపునిచ్చింది. ఆ నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు ఉన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం చివరి శీతాకాల సమావేశాలు నిర్వహించనుంది. అందుకే...ఎన్నికలపై ప్రభావం చూపించే అంశాలపై ఫోకస్ పెట్టింది. కీలక బిల్స్‌ని ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఎన్నాళ్లుగానో పెండింగ్‌లో ఉన్న బిల్స్‌ని క్లియర్ చేయాలని చూస్తోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం దాదాపు 18 బిల్స్‌ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది కేంద్రం. జమ్ముకశ్మీర్, పుదుచ్చేరికి సంబంధించి మహిళా రిజర్వేషన్ చట్టంలో రెండు ప్రొవిజన్స్‌కి సంబంధించిన రెండు బిల్స్‌తో పాటు క్రిమినల్ చట్టాలను రీప్లేస్ చేసే కొత్త బిల్స్‌నీ ప్రవేశపెట్టనుంది. వీటితో పాటు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను 107 నుంచి 114కి పెంచేందుకు ఉద్దేశించిన బిల్‌పైనా చర్చ జరగనుంది. డిసెంబర్ 4 న మొదలయ్యే శీతాకాల సమావేశాలు 22వ తేదీ వరకూ కొనసాగనున్నాయి.

డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. దీంతో కేంద్రం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈరోజు ఉదయం 11గంటలకు పార్లమెంట్ లైబ్రరీ హాల్లో ఈ సమావేశమైంది. డిసెంబర్ 4 నుంచి 22 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. కేంద్రం పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది.24 బిల్లులను సభలో ప్రవేశపెట్టి ఆమోదించాలని భావిస్తోంది.

కాగా..ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన తరువాత జరుగనున్నా పార్లమెంట్ సమావేశాలు కావడంతో ఈ సమావేశాలు ఆసక్తికరంగా మారాయి. ఈ సమావేశాల్లో కేంద్రం పలు కీలక బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలనుకుంటోంది. ప్రస్తుతం 37 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈక్రమంలో కొత్తగా మరో 7 బిల్లులను ప్రవేశపెట్టనుంది.


టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు వేయాలన్న సిఫార్సును కూడా సభలో ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తోంది. భారతీయ శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి, సాక్ష్యాధారాల చట్టాల స్థానంలో కొత్త బిల్లులు కూడా సభ ముందురానున్నాయి. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్, ఎలక్షన్‌ కమిషనర్ల నియామక బిల్లును కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశముంది. దీంతో శీతాకాల సమావేశాలు వాడీ వేడిగా జరగనున్నాయి. కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులపై ప్రతిపక్షాలు ఎలా స్పందించనున్నాయో వేచి చూడాలి.

Tags

Next Story