అమ్మకు ప్రేమతో.. తాజ్ మహల్ రూపంలో స్మారకం

అమ్మకు ప్రేమతో.. తాజ్ మహల్ రూపంలో స్మారకం
తనను పెంచి పెద్ద చేసి.. ఇంత వాడిని చేసిన తల్లికి ఏమిచ్చి తన రుణం తీర్చుకోవాలని ఆలోచన చేశాడు..

తనను పెంచి పెద్ద చేసి.. ఇంత వాడిని చేసిన తల్లికి ఏమిచ్చి తన రుణం తీర్చుకోవాలని ఆలోచన చేశాడు.. ప్రపంచంలో ప్రేమకు గుర్తుగా నిర్మించిన తాజ్ మహల్ తన మదిలో మెదిలింది. అదే రూపంతో అమ్మకు ఇల్లు కట్టించి ఇచ్చాడు.. అమ్మపై తనకున్న ప్రేమను ఆ విధంగా చాటుకున్నాడు.

హృదయాన్ని హత్తుకునే సంఘటన చెన్నైలో జరిగింది. తిరువారూర్ సమీపంలో తన తల్లి జ్ఞాపకార్థం మినీ తాజ్ మహల్ స్మారక గృహాన్ని నిర్మించాడు కొడుకు అమ్రుద్దీన్ షేక్.

మేము మా తల్లిని అమితంగా ప్రేమిస్తాము. ఆమె అంటే మాకు ఎనలేని గౌరవం. ఆమె మరణించినా మా హృదయంలో పదిలంగా ఉంది. తండ్రి అబ్దుల్ ఖాదర్ మరణించినప్పుడు అమ్రుద్దీన్ షేక్ దావూద్ వయస్సు కేవలం 11 సంవత్సరాలు. అతని తండ్రి మరణానంతరం, అతని తల్లి జైలానీ బీవీ అన్ని బాధ్యతలను చేపట్టింది. కొడుకు అమ్రుద్దీన్ తో పాటు, నలుగురు కుమార్తెలను పెంచుతూనే కుటుంబ పోషణ కోసం తన భర్త నిర్వహించిన హార్డ్‌వేర్ వ్యాపారాన్ని కొనసాగించింది.

“చెన్నైలో హార్డ్‌వేర్ వ్యాపారి అయిన మా నాన్నను పోగొట్టుకున్నప్పుడు నేను మరియు నా నలుగురు సోదరీమణులు చాలా చిన్నవాళ్ళం. మా అమ్మ జైలానీ బీవీకి 36 ఏళ్లు. అంత చిన్న వయసులో అమ్మ మా ఐదుగురిని పెంచి పెద్ద చేసింది. డిసెంబర్ 2020లో 68 ఏళ్ల వయస్సులో ఆమె మరణించింది. ఆమె మరణం మాకు తీరని దు:ఖాన్ని మిగిల్చింది. ఆమె ఉనికి శాశ్వతంగా ఉండాలని భావించాము. కాబట్టి నా కుటుంబ సభ్యుల అంగీకారంతో అమ్మయ్యప్పన్‌లోని ఒక ఎకరం స్థలంలో ఆమె కోసం ఈ సమాధిని నిర్మించాలని నిర్ణయించుకున్నాను” అని అమ్రుద్దీన్ షేక్ దావూద్ చెప్పారు.

తన తల్లి త్యాగాలకు నివాళులర్పించేందుకు, అమ్రుద్దీన్ అత్యంత అందమైన స్మారక కట్టడాలలో ఒకటైన తాజ్ మహల్ ఆకారంలో స్మారక గృహాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. స్మారకం నిర్మాణానికి రూ. 5 కోట్లు ఖర్చవుతుండగా, వినియోగించిన పాలరాయి రాజస్థాన్‌ నుంచి వచ్చింది. ఇది పూర్తి కావడానికి రెండు సంవత్సరాలు పట్టింది. ఇది జూన్ 2, 2023న ప్రజల సందర్శనకు వీలుకల్పించారు.

Tags

Read MoreRead Less
Next Story