8 అంతస్థుల భవనం.. లిఫ్ట్ కేబుల్ తెగిపోవడంతో మహిళ మరణం..

నోయిడా హై-రైజ్ అపార్ట్ మెంట్ భవనం వద్ద 8 అంతస్తుల లిఫ్ట్ కూలిపోవడంతో 73 ఏళ్ల మహిళ మరణించింది. లిఫ్ట్ కొన్ని మధ్య అంతస్తుల మధ్య చిక్కుకుపోయిందని పోలీసు అధికారి తెలిపారు.
మహిళ లిఫ్ట్‌లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆ ఘటన చోటు చేసుకుంది.సెక్టార్ 142 పరిధిలోని సెక్టార్ 137లోని పరాస్ టియెర్రా సొసైటీలో లిఫ్ట్ వైర్ తెగిపోవడంతో లిఫ్ట్‌లో వెళ్తున్న ఒక మహిళ స్పృహతప్పి పడిపోయింది. మహిళ లిఫ్ట్‌లో ఒంటరిగా ఉంది. ఆమెను ఫెలిక్స్ ఆసుపత్రిలో చేర్చారు, కానీ చికిత్స పొందుతూ మరణించింది.
సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగ్గా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గంట తర్వాత మహిళ కన్నుమూసింది. "మహిళకు తల వెనుక భాగంలో గాయాలు అయ్యాయి. ఆకస్మిక సంఘటన కారణంగా గుండె ఆగిపోయింది అని వైద్యులు నిర్ధారించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com