Maharashtra: అడవిలో అమెరికా మహిళపై అమానుషం

మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో అత్యంత హేయమైన ఘటన చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన లలితా కయీ కుమార్ అనే మహిళ(50)ను గుర్తు తెలియని వ్యక్తులు అటవీప్రాంతంలో చెట్టుకు గొలుసుతో బంధించి వెళ్లారు. ఆకలితో అలమటిస్తూ, వర్షంలో తడిసి నీరసించిపోయిన ఆమె ఆర్తనాదాలు విన్న గొర్రెల కాపరి ఒకరు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.
తనతో గొడవ పడిన భార్యను అడవికి తీసుకెళ్లి గొలుసుతో ఆమె కాళ్లను చెట్టుకు కట్టేసి పరారయ్యాడో భర్త. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్న ఆమెను ఓ గొర్రెలకాపరి చూడడంతో ప్రాణాలతో బయటపడగలిగింది. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ అటవీ ప్రాంతంలో జరిగిందీ ఘటన. సోనుర్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి శనివారం ఆమె ఏడుపు విని దగ్గరకు వెళ్లి చూసి నిర్ఘాంతపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను రక్షించి ప్రాథమిక చికిత్స అనంతరం దవాఖానకు తరలించారు. ఆమెను అమెరికాకు చెందిన లలిత కాయి కుమార్ ఎస్ (50)గా గుర్తించారు.
ప్రస్తుతం ఆమె తమిళనాడులో ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. బాధిత మహిళ మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. ఆమె తన సమస్యలను పేపరు మీద రాసి వైద్యులకు చెప్తున్నది. 40 రోజులుగా తనకు ఆహారం లేదని, చిన్నపాటి గొడవ తర్వాత భర్తే తనను అడవిలోకి తీసుకెళ్లి గొలుసుతో చెట్టుకు కట్టేసినట్టు తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె వాంగ్మూలం ఇచ్చే పరిస్థితిలో లేదని, రెండ్రోజుల నుంచి ఆమె ఏమీ తీసుకోకపోవడంతో బలహీనంగా ఉందని పోలీసులు తెలిపారు. ఎన్ని రోజుల నుంచి ఆమెను చెట్టుకు కట్టేశారో తెలియదని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com