UP: ఎదురొచ్చిందని .. పిల్లిని సజీవ దహనం చేసిన యువతులు

UP: ఎదురొచ్చిందని .. పిల్లిని  సజీవ దహనం చేసిన యువతులు
X
వీడియో క్లిప్‌ బయటకు రావడంతో వ్యవహారం వెలుగులోకి

ఎవరైనా బయటకు అతి ముఖ్యమైన పనుల మీద వెళ్లేటప్పుడు ముహూర్తం, వర్జ్యం వంటివి చూసుకుని వెళ్తుంటారు. అలాగే అమంగళకరమైనవి ఏవీ రోడ్డుపై ఎదురు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకవేళ అలా ఏదైనా ఎదురైతే ఇంటికొచ్చి కాసేపు కూర్చుని తిరిగి ప్రయాణం మొదలు పెడతారు. ఇలా అశుభంగా పరిగణించేవాటిల్లో నల్ల పిల్లి ఒకటి. ఎక్కడికైనా వెళ్లేటప్పుడు నల్లపిల్లి ఎదురైతే వారు తిరిగి ఇంటికి చేరుకోరని ఎప్పటి నుంచో జనాల్లో బలమైన నమ్మకం వేళ్లూనుకుపోయింది. తాజాగా ఓ మహిళ, ఆమె స్నేహితులు కలిపి బయటకు వెళ్తుండగా పిల్లి ఎదురువచ్చింది. అంతే ఆ పిల్లిన వెంటాడి, వేటాడి పట్టుకుని సజీవదహనం చేసి దానిని చంపారు. అంతటితో ఆగకుండా దీనిని రికార్డ్‌ చేశారు. ఆ వీడియో క్లిప్‌ బయటకు రావడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో చోటు చేసుకుంది. ఎస్పీ దేహత్ కున్వర్ ఆకాష్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం..

నేపథ్యంలో వన్యప్రాణుల రక్షణ చట్టం కింద ఆ మహిళ, ఆమె స్నేహితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ జిల్లాలో భోజ్‌పూర్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ తన ఫ్రెండ్స్‌తో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. వారికి ఒక పిల్లి ఎదురు వచ్చింది. పిల్లి రోడ్డు దాటడాన్ని అపశకునంగా భావించారు వారంతా. అంతా ఆ పిల్లిని వెంబడించి పట్టుకున్నారు. దానికి నిప్పుపెట్టి సజీవంగా దహనం చేశారు. ఈ దారుణాన్ని వీడియో రికార్డ్‌ చేసిమరీ ఆనందించారు. ఈ వీడియో బయటకు రావడంతో ఢిల్లీలోని వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది.

వీడియో క్లిప్‌తో సహా ఈమెయిల్ ద్వారా వారికి ఫిర్యాదు అందడంతో భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వారు సమాచారం ఇచ్చారు. అనంతరం దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా బైక్‌ నంబర్‌ను పోలీసులు ట్రేస్‌ చేయగా.. అది భోజ్‌పూర్‌కు చెందిన ప్రియాగా గుర్తించారు. ప్రియను, ఆమె స్నేహితుల మీద వన్యప్రాణుల రక్షణ చట్టంలోని సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేశారు. దోషులుగా తేలితే మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించే అవకాశం ఉన్నదని పోలీస్‌ అధికారి తెలిపారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతున్నదని, వీడియోను విడుదల చేయలేమని పోలీసులు తెలిపారు.

Tags

Next Story