కన్న ప్రేమను మరిచిన తల్లి.. 9 ఏళ్ల కుమార్తె గొంతు కోసి...

కన్న ప్రేమను మరిచిన తల్లి.. 9 ఏళ్ల కుమార్తె గొంతు కోసి...
సహనానికి మారు పేరు అమ్మ. పిల్లలు ఎంత ఇబ్బంది పెట్టినా భరిస్తుంది.

సహనానికి మారు పేరు అమ్మ. పిల్లలు ఎంత ఇబ్బంది పెట్టినా భరిస్తుంది. పేగు బంధానికి పెద్ద పీట వేసి అక్కున చేర్చుకుంటుంది. ఎంత కష్టంలో అయినా తన బిడ్డలను తనకంటే బాగా ఎవరూ చూసుకోరనుకుంటుంది. కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. కానీ ఇక్కడ ఓ తల్లి తన 9 ఏళ్ల చిన్నారిని గొంతు కోసి చంపేసింది. ఏ పరిస్థితుల్లో అలా చేసిందో పోలీసులు విచారణ చేపట్టారు.

ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో 35 ఏళ్ల మహిళ తన కుమార్తె గొంతును కత్తితో కోసి చంపింది. తీవ్ర గాయాలపాలైన బాలికను సుల్తాన్‌పూర్‌లోని వైద్య కళాశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. నిందితురాలు ప్రియాంక ఓజా మానసిక అనారోగ్యంతో బాధపడుతోందని విచారణలో తేలింది. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రస్తుతం మహిళను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు హత్యపై మరింత దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story