SAD:విషాదం మిగిల్చిన పారాగ్లైడింగ్

SAD:విషాదం మిగిల్చిన పారాగ్లైడింగ్
X
మహిళతో పాటు ఇన్‌స్ట్రక్టర్ కూడా మృతి

సరదాగా సాగాల్సిన పారాగ్లైడింగ్.. ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ విషాద ఘటన గోవాలో చోటుచేసుకుంది. పుణెకు చెందిన 27 ఏళ్ల మహిళా పర్యాటకురాలు శనివారం గోవాలోని కేరి గ్రామానికి వెళ్లింది. సుమల్ నేపాలీ అనే ఇన్‌స్ట్రక్టర్‌ సహాయంతో పారాగ్లైడింగ్‌కు వెళ్లింది. 100 అడుగుల ఎత్తులో వీరు పట్టుతప్పి లోయలో పడిపోయారు. ఇద్దరూ స్పాట్‌లోనే మృతి చెందారు. కంపెనీ యజమాని శేఖర్ రైజాదాపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అసలు ఏం జరిగిందంటే..?

నార్త్ గోవాలోని కేరి గ్రామంలో ఈ దారుణం జరిగింది. మహారాష్ట్రలోని పూణేకు చెందిన శివానీ దాబ్లే గోవా పర్యటనకు వచ్చింది. పారాగ్లైడింగ్ కోసం కేరి గ్రామ సమీపంలోని ఓ కొండపైకి వెళ్లింది. ఆమెతో పాటు పారాగ్లైడింగ్ కంపెనీకి చెందిన ఇన్ స్ట్రక్టర్ సుమల్ నేపాలీ కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి పారాగ్లైడింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. కొండ పైనుంచి గాల్లోకి ఎగిరిన కాసేపటికే పట్టుతప్పి ఇద్దరూ కింద లోయలో పడ్డారు. దీంతో తీవ్రగాయాలపాలైన శివాని, సుమల్ ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. కాగా, పారాగ్లైడింగ్ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేవని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు వివరించారు. కంపెనీ నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు వివరించారు.

Tags

Next Story