Madhya Pradesh: లివ్-ఇన్‌లో ఉన్న మహిళని చంపేసిన వ్యక్తి..
మధ్యప్రదేశ్ దేవాస్ నగరంలో ఒక ఇంట్లో ఫ్రిజ్‌లో మహిళ మృతదేహం శుక్రవారం లభ్యమైంది. ఈ కేసులు గతంలో ఈ ఇంట్లో అద్దెకు ఉన్న సంజయ్ పాటిదార్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆభరణాలు ధరించి, చేతులు మెడను కట్టి ఉంచిన స్థితిలో మహిళ డెడ్‌బాడీ కనిపించింది. మహిళ గత సంవత్సరం హత్యకు గురై ఉండొచ్చని పోలీసులు తెలిపారు. మహిళని పింకీ ప్రజాపతిగా గుర్తించారు.
పింకీ జూన్ 2024లో హత్యకు గురై ఉంటుందని అనుమానిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. గత 8 నెలలుగా మృతదేహాన్ని ఫ్రిజ్‌లోనే ఉంచాడు నిందితుడు. దుర్వాసన రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పొరుగింటి వారు ఇంటి యజమానికి ఫోన్ చేసి చెప్పడంతో, ఇంట్లోకి వెళ్లి చూడగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఫ్రిజ్‌లోని మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఇంటి యజమాని ధీరేంద్ర శ్రీవాస్తవ ఇండోర్‌లో నివసిస్తున్నాడు. శ్రీవాస్తవ ఈ ఇంటిని జూన్ 2023లో ఉజ్జయినికి చెందిన సంజయ్ పాటిదార్‌కి అద్దె ఇచ్చారు. పాటిదార్ 5 ఏళ్లుగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరు భార్యభర్తలమని చెప్పి ఇరుగుపొరుగు వారిని నమ్మించారు. వివాహం చేసుకోవాలని ఒత్తిడి తేవడంతోనే పాటిదార్ తన స్నేహితుడి సాయంతో పింకీని చంపేసినట్లు తెలుస్తోంది. పాటిదార్‌కి అప్పటికే వివాహం అయింది.
నిందితుడు పటిదార్ .. ఉజ్జయిన్ నివాసి. గత అయిదేళ్లతో నుంచి బాధిత మహిళతో అతను లివిన్ రిలేషన్‌లో ఉన్నారు. పెళ్లి చేసుకోవాలని వత్తిడి చేయడం వల్లే.. పటిదార్ ఆ మహిళను చంపి ఉంటారని భావిస్తున్నారు. స్నేహితుడి హెల్ప్ తీసుకుని హత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఇంట్లో నుంచి చెడు వాసన రావడంతో.. ఓనర్‌ను పిలిపించారు. అయితే ఓ రూమ్‌ను తెరవగా దాంట్లో ఉన్న ఫ్రిడ్జ్‌లో మహిళ శవాన్ని గుర్తించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com