Karnataka: ఆరేళ్లలో ఏడు పెళ్లిళ్లు.. మహిళపై కోర్టు ఆగ్రహం

ధనవంతులను పెళ్లి చేసుకుని, ఆ తర్వాత ఏదో సాకుతో విడాకులు తీసుకోవడం కర్ణాటకకు చెందిన మహిళకు పరిపాటిగా మారింది. భర్తపై గృహ హింస కేసు పెట్టి డబ్బులతో ఉడాయించేది. ఇలా ఆరేళ్లలో ఏడు వివాహాలు చేసుకుంది. ఏడో భర్త ఆమె మోసాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జడ్జి మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ భర్తతోనూ ఎక్కువ రోజులు ఉండకపోవడంలో ఆమె తప్పే కనిపిస్తోందని మండిపడ్డారు. తదుపరి విచారణను వాయిదా వేశారు.
తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని కోరుతూ కర్ణాటకలో ఓ మహిళ చేసుకున్న దరఖాస్తును చూసి ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఆగ్రహాం వ్యక్తం చేశారు. నగదు సంపాదనకే శ్రీమంతులను చూసి వివాహం చేసుకోవడం, అనంతరం ఏదో ఒక సాకు చెప్పి విడాకులు తీసుకోవడం చేస్తోందని సదరు మహిళ ఏడో భర్త న్యాయస్థానం దృష్టికి తీసుకురావడంతో ఆమె వంచన బయటపడింది. ఇలా ఆరేళ్లలో ఆరుగురు భర్తలను మార్చిన ఆమె.. వివాహమైన ఆరు నెలల అనంతరం తనను భర్త, అత్తింటి కుటుంబ సభ్యులు వేధిస్తున్నారంటూ గృహహింస కింద కేసులు పెట్టేది. వారు రాజీ పడి, పెద్ద మొత్తంలో నగదు ఇచ్చి తప్పుకొనేవారు. ఇలా తాజాగా ఆ మహిళ ఏడో భర్తపైనా మళ్లీ కేసు పెట్టింది. దీంతో ఆ మహిళ తీరును న్యాయమూర్తి సోమవారం ఖండించారు. ఏ భర్తతోనూ ఎక్కువ రోజులు కలిసి ఉండకపోవడమంటే.. అందులో మీ తప్పే కనిపిస్తోందని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com