మధ్యప్రదేశ్ మాజీ సీఎంకు మహిళలు భావోద్వేగ వీడ్కోలు..

మూడు పర్యాయాలు ఎన్నికల్లో గెలిచిన రాష్ట్రంలోని అత్యున్నత పదవిని అలంకరించి రాష్ట్ర ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. అయితే ఆయన ఇప్పుడు సీఎం పదవి నుంచి నిష్క్రమించడం వారికి ససేమిరా మింగుడు పడడం లేదు. అందుకే వారు తమ కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక ముఖ్యమంత్రికి ప్రజల హృదయాల్లో చోటు సంపాదించడం కంటే కావలసింది ఏముంటుంది. అది శివరాజ్ సింగ్ చౌహాన్ కి మాత్రమే సాధ్యమైంది.
పదవీ విరమణ చేసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మహిళలు భావోద్వేగ వీడ్కోలు ఇచ్చారు. వారిని అతను లాడ్లీ బెహనాస్ (ప్రియమైన సోదరీమణులు) అని పిలుస్తారు. అందుకే వారు చౌహాన్ ను తన పదవిని వదులుకోవద్దని కోరారు. ‘నిన్ను అందరూ ఇష్టపడతారు.... మేం నీకు ఓటేశాం..’ కానీ మీరు ఇప్పుడు మా ముఖ్యమంత్రి కాదు అని తెలిసి మా గుండెలు రోదిస్తున్నాయి అని ఓ మహిళ ఆ వీడియోలో చెప్పింది.
"నేను ఎక్కడికీ వెళ్ళను" అని శివరాజ్ సింగ్ చౌహాన్ మహిళలకు భరోసా ఇస్తున్నారు. 'లాడ్లీ బెహనా' పథకాన్ని తొలిసారిగా మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని రాష్ట్ర బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తొలుత ఈ పథకం కింద మహిళలకు రూ.1,000 ఆర్థిక సాయం అందజేయగా, ఆగస్టులో రూ.1,250కి పెంచారు.
మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రిగా ఎన్నికైన అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు."నేను చాలా సంతృప్తి చెందాను, నేను 2005లో ముఖ్యమంత్రిని అయ్యాను, ఉమాభారతి కృషితో ఆ ప్రభుత్వం ఏర్పడింది. మరోసారి భారీ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది.. నా హృదయం ఆనందంతో, సంతృప్తితో నిండిపోయింది’’ అని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. కొత్తగా ఎన్నికైన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఉప ముఖ్యమంత్రిగా నియమితులైన జగదీష్ దేవదా, రాజేంద్ర శుక్లాలకు చౌహాన్ అభినందనలు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ భారీ విజయానికి ప్రధానమంత్రి మోదీ, 'లాడ్లీ బెహనా' స్కీమ్ తోడ్పడ్డాయని ఆయన పేర్కొన్నారు.
"ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నాయకత్వంలో, బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేస్తుందని నాకు నమ్మకం ఉంది. అభివృద్ధి పరంగా మధ్యప్రదేశ్ కొత్త శిఖరాలను అధిరోహిస్తుందని శివరాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యధిక కాలం (16.5 ఏళ్లు) శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత దక్కించుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com