జాతీయ

NFHS Survey : శృంగార సంబంధాల్లో పురుషులకంటే మహిళలే ముందున్నారట..

NFHS Survey : సాధారణంగా ఒకరికంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాలను పురుషులే ఏర్పరుచుకుంటారని అనుకుంటాము.

NFHS Survey : శృంగార సంబంధాల్లో పురుషులకంటే మహిళలే ముందున్నారట..
X

NFHS Survey : సాధారణంగా ఒకరికంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాలను పురుషులే ఏర్పరుచుకుంటారని అనుకుంటాము. కానీ తాజాగా నిర్వహించిన సర్వే ప్రకారం మహిళలకే శృంగార భాగస్వాములు అధికంగా ఉన్నారట. జాతీయ కుటుంబ సర్వే (NFHS) 28 రాష్ట్రాల్లో 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో సర్వే చేపట్టింది. ఇందులో రాజస్థాన్, హరియానా, చండీగఢ్, జమ్ముకశ్మీర్, మధ్యప్రదేశ్, కేరళ, అస్సాం, లక్షద్వీప్, పుదుచ్చెరి, తమిళనాడులో పురుశులకంటే మహిళలే ఎక్కువ మందితో శృంగార సంబంధం ఏర్పరుచుకున్నట్లు తేలింది. అయితే పట్టణాల్లో పురుషులు ఈ విషయంలో ముందుండగా.. గ్రామాల్లో మహిళలే ముందు వరుసలో ఉన్నట్లు తేలింది.

రాజస్థాన్‌లో ఒక మహిళ 3.1 మందితో లైంగిక సంబంధం కలిగి ఉంటే.. పురుషుడు 1.8 మందితో ఉన్నట్లు సర్వేల ద్వారా బయటపడింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో, ఏపీలో 0.1 శాతం మంది మహిళలు ఇద్దరి కంటే ఎక్కువ మందితో శృంగార సంబంధాలు కలిగి ఉంటే.. పురుషుల్లో 1.2 శాతంగా ఉన్నారు. తెలంగాణలో మహిళలు 0.4 శాతంగా ఉంటే.. పురుషులు 2.1 శాతంగా ఉన్నారు.

Next Story

RELATED STORIES