Karnataka: భర్తను ప్రియురాలికే అమ్మేసిన గృహిణి

సినిమా స్టోరీ కి ఏమాత్రం తీసిపోని ఓ అసాధారణ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. వేరే ఆమెతో సంబంధం పెట్టుకున్నందుకు ఓ మహిళ తన భర్తను అతడి ప్రియురాలికే అమ్మేసింది. మండ్యకు సమీపంలోని ఓ గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది.
గొడవల కారణంగా భార్యభర్తలు విడిపోవటం మనకి తెలుసు. కొందరు వివాహేతర సంబంధాల కారణంగా దూరమవుతున్నారు. అయితే.. విడిపోతున్న సమయంలో కోర్టు తీర్పు భార్యకు భరణం చెల్లించాల్సి ఉంటుందంటూ తీర్పులు వెల్లడిస్తాయి. అయితే కర్ణాటకలో ఓ భార్య చేసిన పని అందరినీ షాక్‌కు గురి చేసింది. కర్ణాటకలో జరిగిన ఓ సంఘటన సినిమా కథకు ఏమాత్రం తీసిపోలేదు. ఒక మహిళ తన భర్తను అతడి ప్రియురాలికే రూ.5లక్షలకు అమ్మేసింది. మండ్య సమీపంలోని ఓ గ్రామంలో వెలుగు చూసింది ఈ కథ. ఇటీవల ఒక గృహిణి తన భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉండటం చూసింది. దాంతో వారిద్దరినీ నిలదీసింది. సన్నిహితంగా ఉండగానే పట్టుకోవడంతో వారేమీ ఎదురు చెప్పలేకపోయారు. దాంతో.. పంచాయితీ పెద్ద మనుషుల మధ్యకు వెళ్లింది. ఊ తన భర్తను వలలో వేసుకుందనీ.. భర్త కూడా తనని మోసం చేశాడని న్యాయం చేయాలని కోరింది.
అయితే గృహిణికి ఆమె భర్తను అప్పగించాలంటే తనకు అతడు బాకీ పడ్డ రూ.5 లక్షలు చెల్లించాలని ప్రియురాలు షరతు పెట్టింది. దీంతో ఆ ఇల్లాలికి చిర్రెత్తుకోచ్చింది. ఇలాంటి భర్త తనకొద్దన్న గృహిణి తనకే రూ.5 లక్షలు మనోవర్తి కింద ఇస్తే తన భర్తను ఆమెకు వదిలేసేందుకు సిద్ధమని చెప్పింది. ఒక నెల రోజుల వ్యవధిలో రూ.5లక్షలు మనోవర్తి కింద గృహిణికి చెల్లిస్తానని ప్రియురాలు ఒప్పుకుంది. దాంతో.. భర్త బదిలీ పూర్తయ్యింది. వారి మధ్య కుదిరిన ఈ అద్భుతమైన ఒప్పందం చూసి గ్రామపెద్దలు, గ్రామస్థులు ఆశ్చర్యపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com