Haryana: భర్తను చంపిన యూట్యూబర్.. ఎవరు సహాయం చేశారంటే

హర్యానా లోని హిసార్ జిల్లాలో దారుణమైన మర్డర్ జరిగింది. ఓ మహిళా యూట్యూబర్ తన ప్రియుడితో కలిసి భర్తను అత్యంత కిరాతకంగా చంపింది. వివరాల్లోకి వెళ్తే.. రవీనా, ప్రవీణ్ భార్యాభర్తలు. అయితే 32 ఏళ్ల రవీణాకు ఇన్‌స్టాగ్రామ్‌లో సురేశ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ ఇద్దరూ కలిసి షార్ట్ వీడియోలు తీశారు. హర్యానాలోని ప్రేమ్‌నగర్‌లో వాళ్ల వీడియోలు పాపులర్ అయ్యాయి. ఏడాదిన్నర పాటు ఇద్దరు కలిసి కాంటెంట్ క్రియేట్ చేశారు. అయితే రవీనా భర్త ప్రవీణ్ ఎంత వద్దన్నా ఆమె వినలేదు. కుటుంబసభ్యలు అడ్డుకున్నా.. రవీనా వీడియోలు తీయడం మానలేదు.
షార్ట్ వీడియోలు, డ్యాన్స్ రీల్స్‌తో రవీనాకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 34 వేల మంది ఫాలోవర్లు అయ్యారు. ఆమెకు చెందిన యూట్యూబ్ వీడియో సిరీస్‌లోనూ ఇతర ఆర్టిస్టులు ఉన్నారు. వీడియోలు చేయడమే పనిగా పెట్టుకున్న రవీనా.. ఓ దశలో భర్తతో గొడవ పడింది. అయితే మార్చి 25వ తేదీన రవీనా తన ఇన్‌స్టా లవర్ సురేశ్‌తో ఓ అభ్యంతరకరరీతిలో కనిపించారు. దీంతో ఆ ఇద్దరి మధ్య మళ్లీ గొడవ మొదలైంది. అయితే ఆ ఆవేశంలో రవీనా, సురేశ్ ఇద్దరూ కలిసి దుప్పట్టాతో ప్రవీణ్‌ను హత్య చేశారు.
భర్తను చంపిన తర్వాత రాత్రి 2.30 నిమిషాలకు ప్రవీణ్ మృతదేహాన్ని ఓ బైక్‌పై తీసుకెళ్లి.. దిన్నాడ్ రోడ్డులోని డ్రెయినేజీలో పడేశారు. రవీనా ఇంటికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఆ డ్రెయినేజీ ఉన్నది. మార్చి 28వ తేదీన ప్రవీణ్ మృతదేహాన్ని సదర్ పోలీసు స్టేషన్ పోలీసులు గుర్తించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com