G20 Summit: భారత్ బయలుదేరిన బైడెన్‌..

G20 Summit: భారత్ బయలుదేరిన  బైడెన్‌..
ది బీస్ట్‌ ...అది కారు కాదు నడిచే భద్రతా వలయం

జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భారత్‌ బయలుదేరారు. వాషింగ్టన్ డీసీ నుంచి ఆయన తన ప్రత్యేక విమానం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో స్టార్ట్ అయ్యారు. ఈరోజు సాయంత్రం 7 గంటల సమయంలో ఆయన ఢిల్లీ చేరుకోనున్నారు.

న్యూఢిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరిగే జీ20 సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పాల్గొనబోతున్నారు. బైడెన్‌ నేటి సాయంత్రం ఢిల్లీకి రానుండగా.. ఆయన వాడే కాడిలాక్ కారు, ది బీస్ట్ కూడా హస్తినకు చేరుకోనున్నాయి. ది బీస్ట్ కారును బోయింగ్ సీ 17 గ్లోబ్ మాస్టర్ 111 కార్గో విమానం తీసుకొస్తుంది. విమానం దిగిన వెంటనే బీస్ట్ కారులో బయలుదేరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బైడెన్‌ కలుస్తారు. దాంతో ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన కారుగా పేరున్న ‘ది బీస్ట్‌’ ఢిల్లీ వీధుల్లో తిరగనుంది. బైడెన్ కి అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు సెక్యూరిటీ ఇస్తారు. ఇందుకోసం అమెరికన్ సీక్రెట్ సర్వీస్‌కు చెందిన 300 మంది ప్రత్యేక కమాండోలు, కాన్వాయ్‌లో దాదాపు 60 కార్లు కూడా వచ్చారు. అయితే ఆయనే కాకుండా ఈ సమావేశంలో ఆయన కారు కూడా ఆకట్టుకుంది.


ప్రపంచంలోని సూపర్ సేఫ్ లిమోసిన్ కార్లలో ఇది ఒకటి. దీని ముందు భారతదేశంలోని అన్ని వాహనాలు బలాదూరే. ఈ కారులో 9 ప్రత్యేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ప్రమాదం జరిగినప్పుడు, అధ్యక్షుడు బ్లడ్ గ్రూప్‌కి తగిన రక్త సరఫరా చేయగలదు. అలాగే ఆక్సిజన్ సరఫరా సదుపాయం ఉంది. దీనిని 'రోలింగ్ బంకర్' అని కూడా అంటారు. దీనిపై ఎలాంటి పేలుడూ ప్రభావం చూపలేదు. ఈ కారును గ్రహశకలం ఢీకొట్టినా, ఏమీ కాదు. క్షిపణి దాడిని కూడా తట్టుకోగలదు. దాడులను నివారించడానికి, ఈ కారుకు 120 వోల్ట్ కరెంట్ అందించే ఫీచర్ తో రూపొందించారు. ఎవరైనా దాడి చేయాలనుకునే వ్యక్తి, ఈ కారుకు అతి సమీపంలోకి వచ్చి, డోర్ తెరిచి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే, అతను హ్యాండిల్‌ను తాకగానే బలమైన విద్యుత్ షాక్‌కు గురవుతాడు. దాడి చేసిన వ్యక్తి కారు, అమెరికా అధ్యక్షుడి కారును వెంబడిస్తే, 'ది బీస్ట్'లో అతనిని తప్పించుకోవడానికి స్మోక్ స్క్రీన్ ఇస్తుంది. పొగ తెర చమురు-ఆధారిత మిశ్రమాన్ని ఆవిరిగా మార్చడానికి వేడి చేస్తుంది. అప్పుడు ఈ ఆవిరి చల్లటి బయటి గాలితో కలిస్తే, దాని వెనుక పొగమంచు వ్యాపిస్తుంది. ఇది ప్రెసిడెంట్ కారును వెంబడించే వేగాన్ని తగ్గిస్తుంది. దీనిని సద్వినియోగం చేసుకుంటూ, దాడి చేసిన వ్యక్తి నుంచి 'ది బీస్ట్' ఈజీగా తప్పించుకుంటుంది.

Tags

Read MoreRead Less
Next Story