Yasin Malik: ఉగ్రవాదులకు నిధులు అందించిన యాసిన్ మాలిక్‌కు యావజ్జీవ శిక్ష..

Yasin Malik: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద వ్యాప్తి, టెర్రరిస్టులకు ఫండింగ్ కేసులో వేర్పాటువాద నేత యాసిన్‌మాలిక్‌కు దిల్లీ పటియాల కోర్టు యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది. ఈనెల 16న యాసిన్ మాలిక్ ను కోర్టు దోషిగా తేల్చింది. తాజాగా జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. అటు మాలిక్‌కు ఉరిశిక్ష విధించాలని ఎన్‌ఐఏ దిల్లీ పటియాల కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఉగ్ర నిధులకు సంబంధించి యాసిన్ మాలిక్ దోషిగా తేలిన నేపథ్యంలో మరణ శిక్ష విధించాలని NIA కోరింది. అయితే తనపై ఎన్‌ఐఏ చేసిన
కశ్మీర్‌లో టెర్రర్‌ఫండింగ్ కేసులో తనపై నమోదైన అన్ని అభియోగాలను యాసిన్‌మాలిక్ అంగీకరించినట్లు తేలింది. కశ్మీర్‌లో ఫ్రీడమ్ స్ట్రగుల్ పేరుతో ఉగ్రవాదం కోసం నిధులు సేకరించటం, ఉగ్రవాద దాడులకు ప్రణాళికలు వేయడం, ప్రణాళికలను అమలుపరచడంలో యాసిన్ మాలిక్ పాత్ర ఉందని ఎన్‌ఐఏ నిర్ధారించింది. ఇందుకుగాను అంతర్జాతీయ స్థాయిలో నెట్‌వర్క్ ఏర్పాటు చేసినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నది. తాజాగా యాసిన్ మాలిక్ ఆస్తులపై అఫిడవిట్ ఇవ్వాలని కోర్టు ఎన్‌ఐఎని ఆదేశించింది.
టెర్రర్ ఫండింగ్ కేసులో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, హిజ్బుల్ ముజాహిద్దిన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ ఉగ్రవాద నేతల పేర్లను ఈ కేసులో ఎన్ఐఏ దాఖలు చేసిన ఛార్జ్షీట్‌లో పేర్కొన్నది.1990 దశకంలో కశ్మీరీ పండిట్ల హత్యల్లోనూ వీరి పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. కశ్మీర్‌లో ప్రశాంతతకు భంగం కలిగించడం, దేశద్రోహం, దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం, నేరపూరిత కుట్ర, చట్ట వ్యతిరేక కార్యకలాపాల అభియోగాలపై ఎన్‌ఐఏ కోర్టు విచారణ జరిపింది.
యాసిన్ మాలిక్‌కు శిక్ష ఖరారు నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో భద్రతా దళాలలు హై అలెర్ట్ ప్రకటించాయి. శ్రీనగర్ లాల్‌చౌక్ ప్రాంతంలో బంద్ వాతావరణం నెలకొంది. ఓల్డ్‌సిటీలో ప్రజారవాణా సైతం నామమాత్రంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com