నిన్న బెంగళూరు.. నేడు ఘజియాబాద్.. క'న్నీటి' కష్టాలు

నిన్న బెంగళూరు.. నేడు ఘజియాబాద్.. కన్నీటి కష్టాలు
భూగర్భజలాలు అడుగంటి పోతున్న తరుణంలో దేశంలో చాలా ప్రాంతాల్లోని ప్రజలు నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు.

భూగర్భజలాలు అడుగంటి పోతున్న తరుణంలో దేశంలో చాలా ప్రాంతాల్లోని ప్రజలు నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. కనీసం తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు దొరక్క నానా కష్టాలు పడుతున్నారు. స్మార్ట్ సిటీగా పేరు గాంచిన బెంగళూరులో గత పది రోజుల నుంచి నీటి కొరత స్థానికులను ఇబ్బందులు పెడుతోంది. ఈ క్రమంలోనే ఉద్యోగులను ఆఫీసులకు రావొద్దు, అందరూ ఇంటి నుండే పని చేయండని ఆర్డర్స్ పాస్ చేసింది. ఇప్పుడు ఘజియాబాద్ కూడా నీటి సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది.

భూగర్భజల మట్టం పడిపోవడంతో నగరాన్ని 'రెడ్ జోన్'గా ప్రకటించారు. ఘజియాబాద్‌లో నియంత్రణ లేని నీటి దోపిడీ వల్ల ఉపరితల జలాలే కాకుండా భూగర్భ జలాలు కూడా ప్రమాదంలో పడినట్లు భూగర్భ జల శాఖ నివేదిక వెల్లడించింది. ఇది కేవలం ఘజియాబాద్ మాత్రమే కాదు, ఇతర జిల్లాలైన బుందేల్‌ఖండ్, మహోబా, లలిత్‌పూర్, ఝాన్సీ, బందా మరియు హమీర్‌పూర్‌లలో కూడా భూగర్భజలాలు గణనీయంగా క్షీణించాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లా అధికారులు ఆందోళన వ్యక్తం చేయడంతో జనవరిలో ప్రారంభించిన జిల్లా జియోలాజికల్ మేనేజ్‌మెంట్ కమిటీ సర్వే ప్రకారం 30 వేలకు పైగా చిన్న, పెద్ద పరిశ్రమలు భూగర్భ జలాలను అక్రమంగా దోచుకుంటున్నాయి. అనియంత్రిత నీటి దోపిడీ వల్ల 2016లో 24.9 మీటర్లు ఉన్న భూగర్భ జలాలు 2023లో 33 మీటర్లకు పడిపోయాయి. దీన్ని బట్టి చూస్తే కేవలం ఏడేళ్లలో ఏడు మీటర్లకు పైగా భూగర్భ జలాలు పడిపోయాయి.

ఘజియాబాద్‌లో సర్వే ప్రారంభం

నీటి సంక్షోభం గురించి నివేదిక వెలుగులోకి వచ్చిన తరువాత, ఘజియాబాద్ జిల్లా యంత్రాంగం భూగర్భ జలాలను పగలు మరియు రాత్రి అక్రమంగా దోపిడీ చేస్తున్న పారిశ్రామిక యూనిట్లను సర్వే చేయడం ప్రారంభించింది. జిల్లాలో డజనుకు పైగా పారిశ్రామిక ప్రాంతాలలో దాదాపు 30,000 చిన్న, పెద్ద యూనిట్లు ఉన్నాయి. కొన్ని మాత్రమే భూగర్భ జలాల కనెక్షన్‌లను కలిగి ఉన్నాయి. లోనీ, ట్రోనికా సిటీ, రూప్‌నగర్, బులంద్‌షహర్ రోడ్ పారిశ్రామిక ప్రాంతాల్లోని మెజారిటీ యూనిట్లలో అక్రమ భూగర్భజలాల దోపిడీని కనుగొన్నట్లు సర్వేలో తేలింది.

బెంగళూరులో ఏం జరుగుతోంది

బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (BWSSB) స్విమ్మింగ్ పూల్స్‌లో తాగునీటిని ఉపయోగించడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్డర్‌ను ఉల్లంఘిస్తే రూ. 5,000 జరిమానా విధించనున్నట్లు బోర్డు పేర్కొంది. కాగా, బెంగళూరులో నీటి కొరతపై బీజేపీ రాజకీయాలకు పాల్పడుతోందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

రేపు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భాజపా నిరసనకు దిగుతుందని, వారు కోరుకున్నది చేయనివ్వండి. ముందుగా కేంద్ర ప్రభుత్వం మహాదాయి, మేకేదాటు ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వండి అని ఉపముఖ్యమంత్రి అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story