Yogi Adityanath: ప్రయాగ్‌రాజ్ అల్లర్లపై యూపీ సర్కార్ సీరియస్.. నిందితులపై బుల్డోజర్ ఆపరేషన్..

Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్‌లోని యోగీ సర్కార్ మళ్లీ బుల్డోజర్లను దింపింది. శుక్రవారం జరిగిన అల్లర్లపై బుల్డోజర్ ఆపరేషన్ చేపట్టారు. అల్లర్లకు పాల్పడిన నిందితుల ఇళ్లను నేలమట్టం చేస్తోంది. ప్రయాగ్ రాజ్ అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడు జావేద్ అహ్మద్‌ను ఇప్పటికే అరెస్ట్ చేయగా, తాజాగా ఆయన ఇంటిని బుల్డోజర్లతో కూల్చారు. వందలాది మంది పోలీసుల పహారాలో జావేద్ ఇంటిని నేలమట్టం చేశారు.
పోలీసులు బుల్డోజర్లతో రావడంతో జావేద్ ఇంటి ముందు హైడ్రామా జరిగింది. నిమిషాల్లోనే ఇంటిని కూల్చేశారు స్థానిక అధికారులు. జావేద్ అహ్మద్ అక్రమంగా ఇంటిని నిర్మించారని గతంలో ఆరోపణలు ఉన్నాయి. జావేద్‌కు ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీ గత నెలలోనే నోటీసు ఇచ్చింది. ఈసారి నోటీసులు ఇచ్చిన గంటల వ్యవధిలోనే బుల్డోజర్లను దించారు అధికారులు. జావేద్ ఇంటికి వచ్చిన అధికారులు.. బుల్డోజర్‌తో ఇంటిని నేలమట్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com