UP: యూపీని వణికిస్తోన్న తోడేళ్లు.. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు

UP: యూపీని వణికిస్తోన్న తోడేళ్లు.. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు
X
యోగి సర్కార్‌ కీలక ఆదేశాలు..!

తోడేళ్లు ప్రజలపై దాడి చేస్తున్నవేళ యూపీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వాటిపై ‘షూట్ ఎట్‌ సైట్‌’ ఆదేశాలు జారీ చేసింది. మానవ రక్తం రుచి మరిగి ప్రాణాంతకంగా మారిన తోడేళ్ల బెడదను అరికట్టడానికి యూపీలోని యోగి ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. తోడేళ్లు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను మంగళవారం జారీ చేసింది. అయితే దీనిని ఆఖరి ప్రత్యామ్నాయంగా మాత్రమే వినియోగించాలని ఆదేశించింది.

ఇటీవల కాలంలో నరమాంస భక్షక తోడేళ్ల దాడిలో భరూచ్‌ జిల్లాలో పలువురు మృతిచెందడంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. కాగా, సోమవారం తన అమ్మమ్మ పక్కన పడుకున్న ఐదేండ్ల బాలికను తోడేలు గాయపరిచింది. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు అప్రమత్తం కావడంతో అది పారిపోయింది. ఇటీవల కాలంలో తోడేళ్ల గుంపు చేసిన దాడిలో ఈ ప్రాంతంలో 34 మంది ప్రజలు గాయపడ్డారు. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అటవీ, పోలీస్‌ శాఖ అధికారులు సంయుక్తంగా ‘ఆపరేషన్‌ భేడియా’ నిర్వహించి నాలుగు తోడేళ్లను పట్టుకున్నారు. ఇంకా మిగిలిన రెండు తోడేళ్ల కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతున్నది. ఈ ప్రాంతాన్ని ఏడు జోన్లుగా విభజించి ఎప్పటికప్పుడు తోడేళ్ల జాడల కోసం ప్రయత్నిస్తున్నారు.

మొత్తం ఆరు తోడేళ్ల తో కూడిన గుంపు సంచరిస్తోందని గుర్తించిన అటవీశాఖ అధికారులు.. ‘ఆపరేషన్‌ భేడియా (Operation Bhediya)’లో భాగంగా ఇప్పటివరకు నాలుగింటిని పట్టుకున్నారు. మిగతా రెండింటిని బంధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా అవి మాత్రం చిక్కట్లేదు. మరోవైపు.. తోడేళ్ల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం రాత్రి కూడా ఓ ఐదేళ్ల పాపపై దాడి చేసి గాయపర్చింది. ఇప్పటివరకు తోడేళ్ల దాడుల్లో 10 మంది మరణించగా.. దాదాపు 30 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో తొమ్మిది మంది చిన్నారులే కావడం గమనార్హం. ఈ క్రమంలోనే తాజాగా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ‘అపరేషన్‌ భేడియా’పై అధికారులు సీఎంకు వివరణ ఇచ్చారు. తోడేళ్లు ఎప్పటికప్పుడు తమ స్థావరాలను మార్చుతుండటంతో పట్టుకోవడం సవాల్‌గా మారుతోందని వివరించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. తోడేళ్లను పట్టుకోవడం అసాధ్యమైన తరుణంలో వాటిని కాల్చేయాలని ఆదేశించారు. అయితే, అది చివరి అవకాశంగా మాత్రమే పరిగణించాలని పేర్కొన్నట్లు సదరు కథనాలు వెల్లడించాయి.

ఈ జీవాలను పట్టుకునేందుకు అధికారులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రంగురంగుల బొమ్మలకు చిన్నారుల దుస్తులు వేసి.. వాటిని పిల్లల మూత్రంతో తడిపి తోడేళ్లు ఉండే గుహలు, నదీ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. మనిషి వాసనలా భ్రమింపజేసి వాటిని ఉచ్చులోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు.

Tags

Next Story