Wife Elope With Lover : భర్త కిడ్నీ అమ్మి.. ప్రియుడితో జంప్

ఫేస్‌బుక్ ప్రియుడి మోజులో పడిన ఓ యువతి తన భర్తను దారుణంగా మోసగించింది. పశ్చిమ బెంగాల్‌లోని సంక్రెయిల్‌కు చెందిన దంపతులకు ఓ కుమార్తె ఉంది. ఆమె విద్య, వివాహం కోసం డబ్బు కూడబెట్టాలని ఆ యువతి తన భర్తను కోరింది. మూత్రపిండాలను అమ్మితే డబ్బులు వస్తాయని, వాటిని బ్యాంకులో వేద్దామని మాయ మాటలు చెప్పింది. దీంతో ఆయన తన మూత్రపిండాన్ని రూ.10 లక్షలకు విక్రయించారు. ఈ సొమ్మును తీసుకుని ఆ యువతి తన ఫేస్‌బుక్ ప్రియుడితో కలిసి పారిపోయింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులిద్దరూ బారక్‌పూర్‌లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లగా, “ఏం చేసుకుంటావో చేసుకో, పో’ అని ఆ యువతి తన భర్తను బెదిరించింది.
అక్రమ సంబంధాల మోజులో కొందరు కన్న బిడ్డలను చిత్ర హింసలకు గురిచేస్తున్న ఘటనలూ ఉన్నాయి. తాజాగా ఈ మహిళ భర్తకు మాయమాటలు చెప్పి, అతని కిడ్నీని అమ్మించి ఆ డబ్బుతో పిల్లలను, భర్తను వదిలేసి, ఫేస్‌బుక్‌లో పరిచయమైన ప్రియుడితో వెళ్లిపోయింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం…పశ్చిమబెంగాల్‌లోని హవ్‌డా జిల్లాకు చెందిన మహిళ తమ కుమార్తెను బాగా చదివించి, వివాహం చేయాలంటే చాలా డబ్బు కావాలని, అందుకు తన భర్తను కిడ్నీ అమ్మాల్సిందిగా సూచించింది. కిడ్నీ అమ్మితే పెద్దమొత్తంలో డబ్బు వస్తుందని దాంతో మన ఆర్ధిక సమస్యలన్నీ తీరిపోతాయని నమ్మించింది.
భార్య పట్టుబట్టడంతో చేసేది లేక సదరు భర్త తన కిడ్నీని రూ.10 లక్షల రూపాయలకు అమ్మాడు. ఆ డబ్బుతో తన కుటుంబ సమస్యలు తీరిపోతాయని, అందరూ సంతోషంగా ఉండొచ్చని భావించాడు. డబ్బు తీసుకొచ్చి భార్యకు ఇచ్చాడు. ఇంకేముంది ఆ డబ్బు తీసుకొని భర్తను, కుమార్తను మోసం చేసి ఫేస్‌బుక్‌లో పరిచయమైన రవిదాస్ అనే వ్యక్తితో మహిళ పరారయ్యింది. విషయం తెలుసుకొని లబోదిబోమన్న భర్త పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల సహాయంతో మహిళ, అతని ప్రియుడు ఉన్న ప్రాంతానికి వెళ్లారు. అయితే ఆ మహిళ తన భర్తతో మాట్లాడేందుకు కూడా ఒప్పుకోకపోగా, అతనికి విడాకులు ఇస్తానని బెదిరించింది. చేసేది లేక, తన భార్య మాటలు నమ్మి మోసపోయానని, తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నాడు సదరు భర్త.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com