AP Special Status: ప్రత్యేకహోదా కోసం వైఎస్ షర్మిల ఢిల్లీలో ధర్నా

AP Special Status: ప్రత్యేకహోదా కోసం వైఎస్ షర్మిల ఢిల్లీలో ధర్నా
శరద్ పవార్ ను కలిసి మద్దతు కోరిన ఏపీసీసీ అధ్యక్షురాలు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల గళం ఎత్తారు. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ గడ్డ మీద ఈ రోజు ధర్నా చేపడుతున్నారు. అంతకుముందు విపక్ష నేతలను వరసగా కలుస్తున్నారు. వివిధ పార్టీ నేతల మద్దతు కోరారు. ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత షర్మిల దూకుడు పెంచారు.

ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలను చేపట్టిన షర్మిల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా వడివడిగా అడుగుల వేస్తున్నారు. మొన్నటి వరకు ఉనికిని కోల్పోయినట్టుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో షర్మిల రాక కొత్త హుషారును నింపింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను ఆమె ప్రధాన అస్త్రాలుగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఏపీలో సుడిగాలి పర్యటనలను చేస్తూ ఇప్పటికే వైసీపీ, టీడీపీలపై షర్మిల విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా అధికార వైసీపీని ఆమె పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. దివంగత వైఎస్సార్ కు తానే అసలైన వారసురాలినని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆమె తన రాజకీయాన్ని ఢిల్లీకి మార్చారు. ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఢిల్లీలో దీక్ష చేపట్టనున్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఈ మధ్యాహ్నం ఆమె దీక్షకు దిగనున్నారు. ఈ దీక్ష ద్వారా ఆమె ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని షర్మిల పట్టుబడుతన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఏపీ భవన్ వద్ద ధర్నా చేపడుతారు. షర్మిలతోపాటు ఏపీ కాంగ్రెస్ నేతలు, శ్రేణులు ధర్నాలో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశం అవుతారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి ఖర్గేకు షర్మిల వివరిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story