ఆవర్తన పట్టిక, ప్రజాస్వామ్యం చాప్టర్లను తొలగించిన NCERT
NCERT సిలబస్ లో మరో మార్పు చేశారు. కేంద్రప్రభుత్వం సరఫరా చేసే పదో తరగతి టెక్ట్స్ బుక్స్‌లో కొన్ని అధ్యాయాలను మార్చేశారు. National Council of Educational Research and Training (NCERT) ఉత్తర్వులు జారీ చేసింది.
ఆవర్తన పట్టిక, ప్రజాస్వామ్యం లాంటి చాప్టర్లను పదో తరగతి సిలబస్ నుంచి తీసివేస్తున్నట్లు ఎన్‌సీఈఆర్‌టీ తెలిపింది. రేషనలైజేషన్‌లో భాగంగా విద్యార్థులపై వత్తిడిని తగ్గించే ఉద్దేశంతో ఆ సిలబస్‌ను తొలగిస్తున్నట్లు ఎన్‌సీఈఆర్టీ తెలిపింది.
ఇటీవలే పదో తరగతి పాఠ్య పుస్తకాల నుంచి పరిణామ సిద్ధాంతాన్ని తొలగించింది.అయితే తాజాగా రిలీజైన ఎన్‌సీఈఆర్టీ పుస్తకాల్లో మరిన్ని చాప్టర్లను తీసివేశారు. పీరియాడిక్ టేబుల్ గురించి కూడా చాప్టర్‌ను తీసివేశారు. సైన్స్ పాఠ్య పుస్తకం నుంచి పర్యావరణ సమతుల్యత, ఇంధనం గురించి అధ్యాయాలను తొలగించారు. ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య సవాళ్లు, రాజకీయ పార్టీలు లాంటి అధ్యాయాలను కొత్త బుక్స్ నుంచి పూర్తిగా తీసేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com