ఉత్తర కొరియా ఉపగ్రహం కూలిపోయింది.. ప్రజలు వణికిపోయారు

ఉత్తర కొరియా ప్రయోగించిన రాకెట్ కూలిపోయింది. ఇది సైనిక గూడచర్యానికి చెందిన ఉపగ్రహాన్ని మోసుకెళ్లిందని శస్త్రవేత్తలు తెలిపారు. రెండవ దశలో ఇంజన్ లో సమస్య తలెత్తిందని చెప్పారు. అతితొందరలోనే మరో ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
ఉత్తరకొరియాకు ఇటు యునైటెడ్ స్టేట్స్ అటు దక్షిణ కొరియాతో ఉద్రిక్తలు పెరిగిన నేపథ్యంలో సైనిక సామర్థాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఉత్తర కొరియా కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా రాకెట్ లాంచ్ లో పాల్గొన్నారు. అయితే రెండవ దశలో రాకెట్ ఫెయిల్ అవడంతో మరో ప్రయోగానికి సిద్దమవనున్నామని చెప్పారు. రాకెట్ లిఫ్ట్ ఆఫ్ లో ఏ తప్పు జరిగిందో తెలుసుకోవడానికి శస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. లోపాలను క్షుణ్ణంగా పరిశోధించి, వాటిని అధిగమించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
దక్షిణ కొరియా, జపాన్ లు అత్యవసర హెచ్చరికలు...
ఉత్తరకొరియా రాకెట్ కూలిపోతుండటంతో దక్షిణ కొరియా, జపాన్ ప్రభుత్వాలు అత్యవసర హెచ్చరికలు జారీ చేశాయి. ప్రజలు బయట తిరగవద్దని రాకెట్ శిథిలాలు ఎక్కడపడనున్నయో తెలియదని తెలిపారు. చివరికి రాకెట్ శిథిలాలు సముద్రంలో పడిపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
ఉత్తరకొరియా ప్రయోగించిన ఉపగ్రహం U.N భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘించడమేనని అమెరికా అభిప్రాయపడింది. బాలిస్టిక్ క్షిపణి సాంకేతికతను ఉపయోగించి ప్రయోగించిన ఏ రాకెట్ అయినా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘిస్తుందని అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకు ఉత్తరకొరియా మరో ఐదు ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇందులో రెండు మాత్రమే కక్షలోకి చేరాయి. 2016లో చివరగా ప్రయత్నం చేసింది. ఆతర్వాత ఇప్పుడు చేసిన ప్రయోగం విఫలం అయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com