ఇది సిగ్గుపడాల్సిన విషయం.. గుత్తా జ్వాలకు కోపం తెప్పించిన నెటిజన్‌ కామెంట్!

ఇది సిగ్గుపడాల్సిన విషయం.. గుత్తా జ్వాలకు కోపం తెప్పించిన నెటిజన్‌ కామెంట్!
X
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఓ నెటిజన్ కామెంట్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. గుత్తా జ్వాల తల్లి ఎలాన్ చైనా జాతీయురాలన్న సంగతి తెలిసిందే.

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఓ నెటిజన్ కామెంట్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. గుత్తా జ్వాల తల్లి ఎలాన్ చైనా జాతీయురాలన్న సంగతి తెలిసిందే. అయితే ఎలాన్ తల్లి ఇటీవల కన్నుమూసింది. దినిపట్ల విచారణ వ్యక్తం చేస్తూ.. శుక్రవారం నివాళులర్పిస్తున్న ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది గుత్తా జ్వాల.

"చైనీస్ న్యూ ఇయర్ రోజున అమ్మమ్మ మరణించింది. అంతకుముందు అమ్మ ప్రతి నెలా చైనాకు వెళ్లి అమ్మమ్మను చూసొచ్చేది. అయితే, కోవిడ్ కారణంగా ఈ ఏడాది అమ్మ వెళ్లలేదు.. మన ప్రియమైన వారికోసం వీలున్నప్పుడే, ఏది చేయాలనిపిస్తే అది చేయాలనే ముఖ్యమైన విషయాన్ని ఈ వైరస్‌ మనకు తెలియజేసింది" అంటూ పోస్ట్‌ చేసింది.

ఈ క్రమంలో ఓ నెటిజన్ గుత్తా జ్వాల పోస్ట్ పైన స్పందిస్తూ.. 'కొవిడా లేక చైనీస్‌ వైరసా?' అంటూ కామెంట్‌ చేశాడు. దీనితో గుత్తా అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ కామెంట్‌ను మళ్లీ ట్వీట్‌ చేసింది. అమ్మమ్మను కోల్పోయిన బాధలో ఓపక్కా మేముంటే, కొందరు జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడం బాధ కలిగించిందన్నారు.

అసలు మనం బతుకుతున్నది సమాజంలోనేనా.. అలాగైతే సానుభూతి ఎక్కడ.. మనం ఎటువైపు పయనిస్తున్నాం.. ఇది సిగ్గుపడాల్సిన విషయం అంటూ ట్వీట్ చేసింది. ఈ సంఘటన పైన ఆమెకు పలువురు అభిమానుల నుంచి మద్దతు లభించింది.


Tags

Next Story