తొలి మ్యాచ్‌లోనే ఓడిన సింధు!

తొలి మ్యాచ్‌లోనే ఓడిన సింధు!
ప్రపంచ నెం.1 షెట్లర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్‌లో 21-19, 12-21, 17-21 సెట్ల తేడాతో ఓడిపోయింది

బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో పీవీ సింధు తొలి మ్యాచ్‌లోనే పరాజయం పాలైంది. ప్రపంచ నెం.1 షెట్లర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్‌లో 21-19, 12-21, 17-21 సెట్ల తేడాతో ఓడిపోయింది. తొలి సెట్‌లో దూకుడుగా ఆడినా... రెండో సెట్‌లో తక్కువ పాయింట్లు నమోదు చేసింది.

ఇక నిర్ణయాత్మక మూడో సెట్‌లో కొన్ని పొరపాట్లు చేయడంతో సింధుకు ఓటమి తప్పలేదు. 59 నిమిషాల పాటు ఈ మ్యాచ్‌ సాగింది. కాగా ఇప్పటివరకు యింగ్‌తో సింధు 21 మ్యాచుల్లో ఆడగా 16సార్లు ఓడిపోయింది. సింధు తన తర్వాతి మ్యాచ్‌లో థాయ్‌లాండ్ క్రీడాకారిణి ఇంతానన్‌ రచనోక్‌తో తలపడనుంది.

రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో సాగే ఈ టోర్నీలో.. గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన క్రీడాకారిణులు సెమీస్‌కు అర్హత సాధిస్తారు. అటు పురుషుల సింగిల్స్‌ గ్రూప్‌-బిలో స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు కూడా తొలి రౌండ్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది.

అండర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్) చేతిలో 21-15, 16-21, 18-21తో శ్రీకాంత్ ఓటమిపాలయ్యాడు.

Tags

Next Story