పంజాబ్‌ ఆటగాడు దీపక్‌ హుడాపై ఫిక్సింగ్‌ ఆరోపణలు..!

పంజాబ్‌ ఆటగాడు దీపక్‌ హుడాపై ఫిక్సింగ్‌ ఆరోపణలు..!
సెకండ్‌‌ ఫేజ్‌‌లో భాగంగా మంగళవారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ అనూహ్యంగా ఓడిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఐపీఎల్‌లో మరోసారి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కలకలం రేగింది. సెకండ్‌‌ ఫేజ్‌‌లో భాగంగా మంగళవారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ అనూహ్యంగా ఓడిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంతేకాదు.. మ్యాచ్ కు కొన్ని గంటల ముందు పంజాబ్ ఆటగాడు దీపక్ హుడా చేసిన ట్వీట్‌ చర్చనీయాంశమైంది. హెల్మెట్‌ పెట్టుకుని ఆటకు సిద్ధమవుతున్న ఫొటో పెట్టి.. ఇదిగో వస్తున్నాం అనే వ్యాఖ్య జోడించాడు. అయితే బీసీసీఐ నిబంధనల ప్రకారం ఇలా ఆటకు ముందు మ్యాచ్, జట్టు సమాచారాన్ని బహిరంగ పరచడం తప్పు. తాను తుది జట్టులో ఉన్న విషయాన్ని ఈ ట్వీట్‌ ద్వారా హుడా చెప్పకనే చెప్పినట్లయింది. ఇది బుకీలకు ఉపయోగపడే విషయమన్న ఉద్దేశంతో బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం హుడా ట్వీట్‌పై దృష్టిసారించింది.

Tags

Read MoreRead Less
Next Story