Wimbledon 2022: వింబుల్డన్‌లో సరికొత్త సంచలనం.. తొలిసారి టైటిల్ గెలిచిన కజకిస్థాన్ క్రీడాకారిణి..

Wimbledon 2022: వింబుల్డన్-2022 మహిళల విజేతగా నయా సంచలనం ఎలెనా రిబకినా నిలిచింది. ఫైనల్‌లో ట్యునీసియా అమ్మాయి ఓన్స్ జెబర్‌ను ఓడించి గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకున్న తొలి కజకిస్థాన్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. వీళ్లిద్దరికీ ఇదే తొలి వింబుల్డన్ ఫైనల్ కావడం విశేషం. 2-6, 6-3, 6-3 తేడాతో ఎలెనా విజయం సాధించింది. మొదటి సెట్‌ను కోల్పోయిన ఎలెనా.. తర్వాత పుంజుకొని ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా పోరాడింది. ఈ విజయంతో కజకిస్థాన్‌కు మొట్టమొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను అందించి రిబకినా చరిత్ర సృష్టించింది.
రిబకినా రష్యాలో పుట్టి, కజకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇక మ్యాచ్ గెలిచిన అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో రిబకినా భావోద్వేగానికి లోనయ్యారు. మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం గురించి చెప్పమనగానే కన్నీళ్లు పెట్టుకున్నారు. అటు మీడియా ప్రతినిధులు ఉక్రెయిన్‌పై రష్యా వైఖరి గురించి ఆమెను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన రిబకినా కజకిస్థాన్ ప్రోత్సాహం వల్లే ఈస్థాయిలో ఉన్నట్లు తెెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com