సంచలనం సృష్టించిన 19 ఏళ్ల అమ్మాయి

సంచలనం సృష్టించిన 19 ఏళ్ల అమ్మాయి
X

పొలాండ్‌ అమ్మాయి స్వైటక్‌ సంచలనం సృష్టించింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన 19 ఏళ్ల స్వైటక్‌.. ఏకంగా టైటిల్‌ను కైవసం చేసుకుంది.. ఫైనల్‌లో అమెరికా క్రీడాకారిణి సోఫియా కెనిన్‌పై 6-4, 6-1 తేడాతో అద్భుత విజయం సాధించింది. గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ ట్రోఫీ గెలిచిన తొలి పొలాండ్‌ టెన్నిస్‌ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.

గ్రాండ్‌స్లామ్‌ గెలిచానంటే తనకిప్పటికీ నమ్మకం కలగడం లేదని స్వైటక్‌ సంతోషం వ్యక్తం చేసింది..స్వైటక్‌ ఇప్పటివరకు ఏడు గ్రాండ్‌స్లామ్‌లు ఆడగా ఎప్పుడూ నాలుగో రౌండ్‌ దాటలేదు. ఈ రెండు వారాల్లో మాత్రం తిరుగులేని ఆటతీరు కనబరిచింది. 2007లో జస్టిన్‌ హెనిన్‌ తర్వాత ఒక్క సెట్టూ ఓడిపోని ప్లేయర్‌గా నిలిచింది. మొత్తం 7 మ్యాచుల్లో 28 గేమ్‌లు మాత్రమే ఓడిపోయింది.

Tags

Next Story