IND vs NZ 2nd Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

IND vs NZ 2nd Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
X
జట్టులో మూడు కీలక మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా

పూణే వేదికగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో రెండో టెస్టు ఆరంభం కానుంది. ఈ టెస్టులో టాస్ గెలిచిన న్యూజీలాండ్ కెప్టెన్ టామ్ లాతమ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఒక మార్పుతో రెండో టెస్ట్ ఆడుతున్నట్లు కివీస్ కెప్టెన్ చెప్పాడు. గాయంతో మాట్ హెన్రీ దూరం కాగా.. మిచెల్ సాంట్నర్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు తాము మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.

ఈ మ్యాచ్‌లో మూడు కీలక మార్పులతో టీమిండియా బరిలోకి దిగింది. జట్టులో మూడు మార్పులు చేశామని కెప్టెన్ రోహిత్ వెల్లడించారు. పేసర్ మహ్మద్ సిరాజ్, మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లను పక్కన పెట్టి పేసర్ ఆకాశ్ దీప్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, యువ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్టు వెల్లడించాడు.

తుది జట్లు

భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా.

న్యూజిలాండ్: టామ్ లాథమ్ (కెప్టెన్), డెవోన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సౌథీ, మిచెల్ సాంట్నర్, అజాజ్ పటేల్, విలియం ఒరోర్కే.

రోహిత్ ఏమన్నాడంటే..

కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. టాస్ గెలిచి ఉంటే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకునే వాళ్లమని చెప్పాడు. ‘‘తొలి టెస్టులో మొదటి సెషన్ మాకు సానుకూలంగా సాగలేదు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మేము బాగానే పుంజుకొని బ్యాటింగ్ చేశాం. దాని నుంచి చాలా సానుకూల అంశాలను నేర్చుకున్నాం. ఆ విషయాలను ఈ మ్యాచ్‌లో ఏ విధంగా ఉపయోగించుకోగలమో చూడాలి. సిరీస్‌లో వెనుకబడి ఉన్నప్పుడు తిరిగి పుంజుకోవడానికి మార్గాలను అన్వేషిస్తుంటారు. మేము కూడా అదే చేస్తాం. ఇక పిచ్ కొంచెం పొడిగా అనిపిస్తోంది. తొలి 10 ఓవర్లు ఎంత కీలకంగా మారతాయో చూడాలి’’ అని రోహిత్ శర్మ అన్నాడు.

మూడు టెస్టుల సిరీస్‌లో భారత్‌ ఓ టెస్టు ఓడి 0-1తో వెనకబడి ఉంది. ఈ టెస్టులో గెలిచి సిరీస్ సమం చేయాలని రోహిత్ సేన్ చూస్తోంది.

Tags

Next Story