Commonwealth Games 2022: కామన్వెల్త్‌గేమ్స్‌‌లో భారత్ సత్తా.. మరో నాలుగు విభాగాల్లో పతకాలు..

Commonwealth Games 2022: కామన్వెల్త్‌గేమ్స్‌‌లో భారత్ సత్తా.. మరో నాలుగు విభాగాల్లో పతకాలు..
Commonwealth Games 2022: కామన్వెల్త్‌గేమ్స్‌ లో మొదట తడబడినా ఇండియన్‌ ప్లేయర్స్‌ ప్రస్తుతం అదరగొట్టేస్తున్నారు.

Commonwealth Games 2022: కామన్వెల్త్‌గేమ్స్‌ లో మొదట తడబడినా ఇండియన్‌ ప్లేయర్స్‌ ప్రస్తుతం అదరగొట్టేస్తున్నారు. బ్యాడ్మింటన్ ఉమెన్స్‌ సింగిల్స్ లో తెలుగు తేజం,ఒలింపిక్‌ చాంపియన్‌ విన్నర్‌ పీవీ సింధు ఫైనల్‌కు దూసుకెళ్లి మరో మెడల్‌ను ఖాయం చేసుకుంది. సెమీస్‌లో సింగ్‌పూర్‌ ప్లేయర్‌ యో జియా మిన్‌పై 21-19, 21-17 తేడాతో సింధు విక్టరీ సాధించింది. మొదటి నుంచే సింధు, మిన్‌ హోరా హోరిగా తలపడ్డారు.

అయితే కీలకమైన సమయంలో ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా పీవీ సింధు తొలి సెట్‌ను రెండు పాయింట్ల తేడాతో కైవసం చేసుకుంది. ఇక రెండో సెట్‌లోనూ సింధు ఆధిక్యం మారుతూ వచ్చింది. అయితే 11-9 ఛేంజ్‌ఓవర్‌ తర్వాత మిన్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా గేమ్‌పాయింట్‌ను సాధించి పీవీ సింధు ఫైనల్‌కు దూసుకెళ్లింది.

కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఇండియన్‌ ఉమెన్స్‌ హాకీ టీం కాంస్య పతకాన్ని సాధించింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పెనాల్టీ షూటవుట్‌లో 2-1 తేడాతో టీం ఇండియా విజయం సాధించింది. మ్యాచ్‌ చివర్లో న్యూజిలాండ్‌ స్కోరును సమం చేసింది. దీంతో ఆట పెనాల్టీ షూటవుట్‌ కు వెళ్లాల్సి వచ్చింది. పెనాల్టీ షూటవుట్‌లో న్యూజిలాండ్‌ ఒకే గోల్‌ సాధించగా.. టీమ్‌ఇండియా 2 గోల్స్‌తో కాంస్య పతకాన్ని సాధించుకుంది.

కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఇండియన్‌ పారా టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ భవినా పటేల్‌ చరిత్ర సృష్టించింది. పారా టేబుల్‌ టెన్నిస్‌ సింగిల్స్ 3-5 కేటగిరీలో స్వర్ణం గెలుచుకుంది. గుజరాత్‌కు చెందిన 35 ఏళ్ల భవినా.. ఫైనల్స్‌లో నైజీరియాకు చెందిన క్రిస్టియానాపై 3-0తో విజయం సాధించింది. టీటీలో భారత తరఫున గోల్డ్‌ సాధించిన మొదటి క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది భవినా. అంతకముందు మరో పారా టీటీ ప్లేయర్‌ సోనాల్‌బెన్‌ మనూబాయి పటేల్‌ కాంస్యం సొంతం చేసుకుంది. దీంతో భారత్‌ 16 స్వర్ణాలు,12 రజతాలు,18 కాంస్య పతకాలను సాధించింది.

కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత బాక్సర్ల పంచ్‌లకు పతకాలు వచ్చి పడుతున్నాయి. పురుషుల ఫ్లైవెయిట్‌లో అమిత్‌ పంగల్‌,మహిళల మినిమమ్‌ వెయిట్‌లో నితూ గంఘాస్‌లు బంగారు పతకాలు సాధించారు. ఇంగ్లీష్‌ బాక్సర్‌ కియరన్‌ మెక్‌డొనాల్డ్‌పై అమిత్‌ మొదటి నుంచి ఆధిపత్యం చూపించాడు. మొదటి రౌండ్‌లో 5-0,రెండో రౌండ్‌లో 4-1 తేడాలో విజయం సాధించాడు. నితూ కూడా ఇంగ్లాండ్‌కే చెందిన ప్రత్యర్థి జేడ్‌ రెస్థన్‌పై పంచుల వర్షం కురిపించింది.మొదటి రౌండ్‌ను 4-1 తేడాతో, రెండో రౌండ్‌లోనూ 4-1తేడాతో విజయం సాధించి,గోల్డ్ మెడల్‌ను గెలుచుకుంది.

Tags

Read MoreRead Less
Next Story