Commonwealth Games 2022: కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత సైక్లిస్ట్ మీనాక్షికి ప్రమాదం..
Commonwealth Games 2022: ఇంగ్లండ్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత సైక్లిస్ట్ మీనాక్షికి ప్రమాదం జరిగింది. మహిళల 10 కిలోమీటర్ల స్క్రాచ్ రేసులో పాల్గొన్న ఆమె.. తన సైకిల్ అదుపుతప్పడంతో కిందపడిపోయింది. అదే సమయంలో ఆమె వెనుకే వస్తున్న న్యూజిల్యాండ్ సైక్లిస్ట్ బ్రయానీ బోథా.. కిందపడి ఉన్న మీనాక్షిని తప్పించలేకపోయి.. మీనాక్షిని తొక్కేసి, తను కూడా పడిపోయింది. ఈ భయంకరమైన దృశ్యాన్ని చూసిన మెడిక్స్ వెంటనే రంగంలోకి దిగి మీనాక్షి, బోథా ఇద్దరికీ ప్రాథమిక చికిత్స అందించారు. ప్రమాదానికి గురైన ఇద్దరు సైక్లిస్టులను రేసు నుంచి పక్కకు తీసుకొచ్చేశారు. ఈ క్రమంలో మీనాక్షికి తీవ్రమైన గాయం కావడంతో ఆమెను స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు.
Horrible accident involving Indian cyclist Meenakshi at the Velodrome. Hope she's ok! #CommonwealthGames #B2022 pic.twitter.com/o0i4CE7M82
— Sahil Oberoi (@SahilOberoi1) August 1, 2022
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com