జొకోవిచ్ కొంపముంచిన బంతి.. టోర్నీ నుంచి అవుట్

జొకోవిచ్ కొంపముంచిన బంతి.. టోర్నీ నుంచి అవుట్
యూఎస్ ఓపెన్ నుంచి జొకోవిచ్ డిఫాల్ట్ అయ్యాడు. జొకోవిచ్ కొట్టిన బంతి లైన్ జడ్జి మెడకు తాకడంతో టోర్నీ నుంచి అనూహ్యంగా

యూఎస్ ఓపెన్ నుంచి జొకోవిచ్ డిఫాల్ట్ అయ్యాడు. జొకోవిచ్ కొట్టిన బంతి లైన్ జడ్జి మెడకు తాకడంతో టోర్నీ నుంచి అనూహ్యంగా వెనుదిరగాల్సి వచ్చింది. ఆర్థర్ స్టేడియంలో జోకోవిచ్, పాబ్లో కారెనో బాస్టా ఆదివారం మొదటి సెట్ లో హోరాహోరీగా తలపడ్డారు. ఈ సెట్ లో 6-5తో జొకోవిచ్ వెనకబడ్డాడు. అయితే మొదటి సెట్ అనంతరం ఛేంజ్ ఓవర్ కోసం అతను పక్కకు వెళ్తూ బంతిని వెనక్కు కొట్టాడు. అది లైన్ జడ్జి మెడకు బలంగా తిగిలి ఆమె కిందపడిపోయింది. జరిగిన ఘటనపై టోర్నమెంట్ రిఫరీ సోరెన్ ఫ్రైమెల్‌తో సహా కోర్టులో అధికారులతో చర్చించి, చైర్ అంపైర్ అరేలీ టూర్టే జకోవిచ్‌ను డిఫాల్ట్‌గా ప్రకటించారు. పొరపాటున జరిగినప్పటకీ.. నిబంధనల ప్రకారం గతంలో జరిగిన ఘటనలు పరిగణలోకి తీసుకొని జొకోవిచ్ ను టోర్నీ నుంచి తొలగించారు.

Tags

Read MoreRead Less
Next Story